న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జమైకా దలేర్ మెహందీతో ధావన్ సెల్పీ: ఫోటో వైరల్

By Nageshwara Rao
 Shikhar Dhawan Calls Chris Gayle The Jamaican Daler Mehndi, Shares Selfie

హైదరాబాద్: వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌పై టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రశంసల వర్షం కురిపించాడు. క్రిస్ గేల్‌ను భారత సింగర్ సింగర్ దలేర్ మెహందీతో పోల్చుతూ ఆకాశానికెత్తాడు. అంతేకాదు క్రిస్ గేల్‌తో కలిసి తీసుకున్న సెల్ఫీని శుక్రవారం ధావన్ అభిమానులతో పంచుకున్నాడు.

పంజాబీ స్టైల్‌లో క్రిస్ గేల్ తలపాగా

మైదానం బయట లోపల క్రిస్ గేల్ తన సహచర ఆటగాళ్లతో ఎంతో సరదాగా ఉండే సంగతి తెలిసిందే. ఈ సెల్ఫీలో క్రిస్ గేల్ పంజాబీ స్టైల్‌లో తలపాగా ధరించాడు. 'నేనెవరిని కలిశానో చూడండి. జమైకన్ దలేర్ మెహందీని.. బోలో తారా రా రా' అంటూ యూనివర్స్ బాస్‌తో కలిసి ఉన్న ఫోటోని ధావన్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా

అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 11వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడిన క్రిస్ గేల్ ఆ జట్టు తరుపున ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డుు సాధించాడు. మొత్తం 11 మ్యాచ్‌లు ఆడిన గేల్ 368 పరుగులు చేశాడు.

16 మ్యాచ్‌లాడిన ధావన్ 497 పరుగులు

16 మ్యాచ్‌లాడిన ధావన్ 497 పరుగులు

ఇందులో ఓ సెంచరీ (104 నాటౌట్) కూడా ఉంది. కాగా, ఈ సీజన్‌లో పంజాబ్ తరుపున కేఎల్ రాహుల్ 659 పరుగులు నమోదు చేశాడు. ఇక, శిఖర్ ధావన్ విషయానికి వస్తే ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పదో స్ధానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో మొత్తం 16 మ్యాచ్‌లాడిన ధావన్ 497 పరుగులు చేశాడు.

ధావన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 92 నాటౌట్

ధావన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 92 నాటౌట్

ఈ సీజన్‌లో ధావన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 92 నాటౌట్. ఐపీఎల్ చరిత్రలో రెండోసారి ఫైనల్‌కు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ముంబైలోని వాంఖడె స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ధావన్ 25 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 26 పరుగులు చేశాడు.

Story first published: Friday, June 1, 2018, 18:59 [IST]
Other articles published on Jun 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X