న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మహిళల క్రికెట్‌లో మార్పులు వద్దు: శిఖా పాండే

Shikha Pandey says Women’s cricket is different sport, don’t make superfluous changes


న్యూఢిల్లీ: ప్రేక్షకుల ఆదరణ కోసం మహిళల క్రికెట్‌లో చిన్న బంతులను వాడడం, పిచ్‌ల సైజ్‌ను తగ్గించడం లాంటి ఆలోచనలు చేయడం అర్థం లేని పనులని భారత వెటరన్‌ పేసర్‌ శిఖా పాండే అభిప్రాయపడింది. ఐసీసీ ఇప్పుడున్న రూల్స్‌ను సడలించడం కంటే మూలాలపై దృష్టిసారిస్తే మహిళల క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందుతుందని శిఖా చెప్పింది.

క్రికెట్ బంతి సైజుతో పాటు వికెట్ల మధ్య దూరాన్ని తగ్గిస్తే మహిళల క్రికెట్ మరింత మందిని అట్రాక్ట్ చేస్తుందని ఐసీసీ నిర్వహించిన వెబినార్‌లో భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్, న్యూజిలాండ్ కెప్టెన్ సోఫియా డివైన్ సూచించారు. అయితే ఈ సలహాలను శిఖా కొట్టిపారేసింది.

'మా ఆట అభివృద్ధి కోసం ఇటీవల చాలా విషయాలు వింటున్నా. నా ఉద్దేశంలో ఇవన్నీ ఉపయోగంలేనివి. ఆ సూచనలు ఎలా ఉన్నాయంటే 100 మీటర్ల రేసులో మహిళా స్ప్రింటర్‌ను 80 మీటర్లు పరుగెత్తించి విజేతగా ప్రకటించినట్టే ఉంటుంది. దాని వల్ల పురుష అథ్లెట్స్ టైమింగ్‌ను కూడా అధిగమించవచ్చు. బౌండరీ సైజును తగ్గించడం లాంటి పనులు అస్సలు చేయవద్దు. ఇటీవలి కాలంలో మాలోనూ పవర్‌ హిట్టర్స్‌ను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు మరింతగా రాణిస్తాం.

కాకపోతే కాస్త ఓపిక అవసరం. చాలా మంది టాలెంటెడ్ ప్లేయర్లున్నారు. క్రీడలను మరింత మార్కెటింగ్ చేయడం ద్వారా అనుకున్న అభివృద్ధిని సాధించవచ్చు. పురుషుల క్రికెట్‌తో మహిళల ఆటను పోల్చవద్దు. ఓ ప్రత్యేకమైన క్రీడగానే పరిగణించాలి. 2020 మార్చి 8న ఇదే మహిళల క్రికెట్(టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌)ను చూసేందుకు 86,174 మంది లైవ్ టెలికాస్ట్‌ను ఎంజాయ్ చేశారనే విషయాన్ని మర్చిపోవద్దు'అని 31 ఏళ్ల శిఖా పాండే చెప్పుకొచ్చింది. జూలన్ గోస్వామి తర్వాత భారత్‌లో గొప్ప పేసర్‌గా పేరు తెచ్చుకున్న శిఖా 104 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 113 వికెట్లు సాధించింది.

అసద్ బాబాయ్ ఫోర్ కొడితే.. మాలిక్ బాబా సిక్స్ కొడుతాడు.. సానియా కుమారుడి ఫన్నీ వీడియో!

Story first published: Monday, June 29, 2020, 8:42 [IST]
Other articles published on Jun 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X