బాగా ఆడినా ఎంపిక చేయలేదు.. చాలా బాధగా ఉంది! ఆటకు వయసు అడ్డుగా కనిపిస్తే నేను ఏం చేయలేను!

Heartbroken' Sheldon Jackson reacts on being left out of India team for Sri Lanka tour

ముంబై: జూలైలో శ్రీలంక పర్యటన సందర్భంగా గురువారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత​ సీనియర్‌ జట్టు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లడంతో.. సీనియర్‌ ప్లేయర్ శిఖర్‌ ధావన్‌ సారధ్యంలో టీమిండియా-బీ జట్టు లంకతో సిరీస్‌ ఆడనుంది. ఐపీఎల్‌, దేశవాలీ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన యువ ఆటగాళ్లకు శ్రీలంక పర్యటనలో బీసీసీఐ సెలెక్టర్లు చోటు కల్పించారు. రుతురాజ్‌ గైక్వాడ్, దేవదత్‌ పడిక్కల్‌, చేతన్‌ సకారియా, కృష్ణప్ప గౌతమ్‌, నితీష్‌ రాణా వంటి యువ ఆటగాళ్లు తొలిసారి భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యారు.

జాక్సన్‌ నిరాశ

జాక్సన్‌ నిరాశ

ఇటీవలే రంజీ ట్రోపీలో దుమ్మురేపిన సౌరాష్ట్ర ఆటగాడు షెల్డన్‌ జాక్సన్‌ శ్రీలంక పర్యటనకు కచ్చితంగా ఎంపికవుతానని భావించాడు. కానీ అతని ఆశలు నెరవేరలేదు. బీసీసీఐ సెలెక్టర్లు అతడిని పరిగణలోకి కూడా తీసుకోలేదు. తాను ఎంపికకాకపోవడంపై స్పందించిన షెల్డన్‌ జాక్సన్‌.. తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ఎంత బాగా ఆడినా తనను భారత జట్టులోకి ఎంపిక చేయలేదని, తన గుండె పగిలిందని పేర్కొన్నాడు. ఆటకు వయసు అడ్డుగా కనిపిస్తే తాను ఏం చేయలేనని నిరాశ చెందాడు. జాక్సన్‌ రంజీ ట్రోపీలో వరుసగా మూడుసార్లు 700కు పైగా పరుగులు చేశాడు.

వరుసగా మూడుసార్లు 750కు పైగా పరుగులు

వరుసగా మూడుసార్లు 750కు పైగా పరుగులు

గత కొంత కాలంగా షెల్డన్‌ జాక్సన్‌ రంజీ ట్రోపీలో దుమ్ములేపుతున్నాడు. రంజీ ట్రోపీలో వరుసగా మూడుసార్లు 750కు పైగా పరుగులు సాధించిన నలుగురు ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఇప్పటివరకు 76 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 5634 పరుగులు, 60 లిస్ట్‌ ఏ మ్యాచ్‌ల్లో 2096 పరుగులు, 59 దేశవాలీ టీ20ల్లో 1240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 44 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్ టోర్నీలోకి ఎంపికయినా.. ఇప్పటివరకు నిరూపించుకునే అవకాశం రాలేదు.

అతడు ఫిట్‌నెస్ టెస్టు తరహాలో పరుగెత్తించాడు.. ఆ మ్యాచ్‌ని ఎప్పటికీ మరిచిపోలేను: కోహ్లీ

ఆ పదం నేను చాలాసార్లు విన్నా

ఆ పదం నేను చాలాసార్లు విన్నా

'ఇప్పుడు నా వయసు 34 ఏళ్లు. కానీ బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నా. 22-23 ఏళ్ల కుర్రాడిలో దూకుడైన ఆటతీరు ఎలా ఉంటుందో.. నేను అలానే ఆడుతున్నా. ఆటకు వయసు అడ్డుగా కనిపిస్తే.. నేను ఏం చేయలేను. లేటు వయసులో జాతీయ జట్టులోకి ఎంట్రీ లేదని క్రికెట్‌ పుస్తకాల్లో ఎక్కడా లేదు.

ఒక ఆటగాడిని ఎంపిక చేయలాంటే.. అతని ఆటతీరు చూడాలని నేను నమ్ముతా. వరుసగా మూడు సీజన్ల పాటు రంజీ ట్రోపీలో 800-900 పరుగులు చేశానంటే ఫిట్‌గా ఉన్నాననే కదా. ఇంకా ఏం చేయాలో అర్ధం కావడంలేదు. అతని వయస్సు 30 కంటే ఎక్కువ.. అందుకే సెలక్ట్‌ కాలేదు అన్న పదం నేను చాలాసార్లు విన్నా' అని షెల్డన్‌ జాక్సన్‌ ఆవేదనకు గురయ్యాడు.

లంక వెళ్లే భారత జట్టు

లంక వెళ్లే భారత జట్టు

శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్ (వైస్‌ కెప్టెన్‌), పృథ్వీ షా, దేవదత్‌ పడిక్కల్‌, హార్దిక్ పాండ్యా, రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్, మనీష్‌ పాండే, నితీష్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌, సంజు శాంసన్‌, యుజ్వేంద్ర చహల్‌, రాహుల్‌ చహర్‌, కృష్ణప్ప గౌతమ్‌, కృనాల్‌ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, దీపక్‌ చహర్‌, నవ్‌దీప్‌ సైనీ, చేతన్‌ సకారియా.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, June 11, 2021, 15:04 [IST]
Other articles published on Jun 11, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X