న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్షమాపణ చెప్పిన విండిస్ పేసర్ గాబ్రియల్: జో రూట్‌ని ఏమన్నాడో తెలుసా?

Shannon Gabriel issues public statement of apology after the ICC ban

హైదరాబాద్: ఇంగ్లాండ్ కెప్టెన్‌ జో రూట్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వెస్టిండిస్ పేస్ బౌలర్ గాబ్రియల్‌ క్షమాపణలు కోరాడు. సెయింట్ లూసియా వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో జో రూట్ బ్యాటింగ్ చేస్తుండగా.. అతని ఏకాగ్రతని దెబ్బతీసే ఉద్దేశంతో గాబ్రియల్ తన నోటికి పని చెప్పిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు మూడో రోజైన సోమవారం కెప్టెన్ జో రూట్‌ను ఉద్దేశించి గాబ్రియల్‌ ఏమన్నాడో స్టంప్‌ మైక్‌లో సరిగ్గా వినిపించక పోయినా... 'గే' గా ఉండటం వల్ల తప్పేంటి? అని జో రూట్ సమాధానం ఇవ్వడం మాత్రం మైక్‌లో రికార్డు అయ్యింది. ఐసీసీ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు గాను గాబ్రియల్‌పై నాలుగు వన్డేల నిషేధం విధించింది.

<strong>India Vs Australia: వన్డే సిరిస్‌కి జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి!</strong>India Vs Australia: వన్డే సిరిస్‌కి జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి!

మ్యాచ్‌ ఫీజులో 75 శాతం కోత

మ్యాచ్‌ ఫీజులో 75 శాతం కోత

దీంతో పాటు అతడి మ్యాచ్‌ ఫీజులో 75 శాతం కోతతోపాటు 3 డీమెరిట్‌ పాయింట్లు కూడా చేర్చింది. అయితే, గాబ్రియల్ నిషేధానికి కారణమైన ఆ వ్యాఖ్యలు ఏంటని అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాలుగు వన్డేల నిషేధం విధించిన తర్వాత గాబ్రియల్ మీడియాతో మాట్లాడాడు.

ఏకాగ్రతను దెబ్బతీసేందుకు

ఏకాగ్రతను దెబ్బతీసేందుకు

"మ్యాచ్‌లో జోరూట్ నిలకడగా ఆడుతుండటంతో అతడి ఏకాగ్రతను దెబ్బతీసి ఒత్తిడి పెంచాలనుకున్నాను. ఈ క్రమంలో బంతి విసిరిన తర్వాత అతనికి దగ్గరగా వెళ్లి.. నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు? నీకు బాయ్స్ అంటే ఇష్టమా?" అని అన్నానని తెలిపాడు.

మ్యాచ్‌ రెఫరీకి ఫిర్యాదు చేసిన అంఫైర్లు

మ్యాచ్‌ రెఫరీకి ఫిర్యాదు చేసిన అంఫైర్లు

దీంతో ఫీల్డ్‌ అంపైర్లు గాబ్రియల్‌పై మ్యాచ్‌ రెఫరీకి ఫిర్యాదు చేశారు. మ్యాచ్‌ అనంతరం గాబ్రియల్‌ తప్పుచేసినట్టు అంగీకరించడంతో లెవల్‌-2 కింద అతడిపై చర్యలు తీసుకున్నారు. గాబ్రియల్ ఖాతాలో ఇప్పటికే 5 డీమెరిట్‌ పాయింట్లు ఉన్నాయి. తాజాగా మూడు పాయింట్లతో కలిపి అతడి పాయింట్ల సంఖ్య ఎనిమిదికి పెరిగింది.

ఓ ఆటగాడు ఎనిమిది అయోగ్యత పాయింట్లు పొందితే

ఓ ఆటగాడు ఎనిమిది అయోగ్యత పాయింట్లు పొందితే

నిబంధనల ప్రకారం 24 నెలల కాలంలో ఓ ఆటగాడు ఎనిమిది అయోగ్యత పాయింట్లు పొందితే.. అతడిపై 2 టెస్టులు లేదా 4 వన్డేలు లేదా 4 టీ20ల నిషేధం విధించవచ్చు. ఇటీవలే సఫారీ పర్యటనలో దక్షిణాఫ్రికా క్రికెటర్‌పై ‘ఏయ్ నల్లోడా' అని స్లెడ్జింగ్‌కి దిగిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై కూడా ఐసీసీ నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, February 14, 2019, 17:26 [IST]
Other articles published on Feb 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X