న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ప్రపంచకప్‌లో ఆ రెండు జట్లే టైటిల్ ఫేవరెట్లు.. షేన్ వాట్సన్ ఆసక్తికర ఒపినియన్ ఇదే

Shane Watson Intresting Comments About Upcoming T20 Worldcup, India and Australia are Favourites

అక్టోబరు 16నుంచి ఆస్ట్రేలియాలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022లో ఆస్ట్రేలియా, భారత్‌ జట్లను తాను టైటిల్ ఫేవరెట్లుగా భావిస్తున్నట్లు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ అన్నాడు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఇటీవల ఆసీస్‌‌ను మూడు మ్యాచ్‌ల సిరీస్లో 2-1తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో భారత్ ఆడిన విధానం బట్టి చూస్తుంటే భారత జట్టు టైటిల్ ఫేవరేట్‌లలో ఒకటిగా ఉందని వాట్సన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం టీ20ఐ టీం ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్ 1 ర్యాంకులో ఉన్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ మెగా ఈవెంట్‌లో స్వదేశీ పరిస్థితులు కచ్చితంగా ఆస్ట్రేలియా జట్టుకు బాగా ఉపయోగపడతాయని వాట్సన్ అన్నాడు.

 టైటిల్ ఫేవరెట్ అని కచ్చితంగా చెప్పగలను

టైటిల్ ఫేవరెట్ అని కచ్చితంగా చెప్పగలను

ఇకపోతే రాయ్‌పూర్‌లో జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ సమావేశంలో వాట్సన్ స్పందించాడు. ఈ ప్రెస్ మీట్లో ప్రఖ్యాత స్పోర్ట్స్ వెబ్ సైట్ మైఖేల్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు వాట్సన్ ఆసక్తికర సమాధానాలిచ్చాడు. 'ఇండియాలో ఇటీవల ముగిసిన సిరీస్లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించింది. చాలా అద్భుతంగా ఆసీస్‌ను నిలువరించింది. కాబట్టి టైటిల్ ఫేవరేట్లలో భారత్ ఒకటి అని కచ్చితంగా చెప్పగలను. నా ప్రకారం.. ఆస్ట్రేలియా, భారత్ టైటిల్ ఎగురవేసుకుపోయే జట్లు కావొచ్చు. ప్రస్తుతం ఇరు జట్లు చాలా మంచి టీ20 క్రికెట్ ఆడుతున్నాయి. అయితే ఆస్ట్రేలియాలో పరిస్థితులు చాలా భిన్నంగా ఉండబోతున్నాయి. మైదానాలు చాలా పెద్దవిగా ఉంటాయి. వికెట్ల విషయంలో పేస్ కచ్చితంగా ప్రభావం చూపుతుంది.' అని వాట్సన్ అన్నాడు.

 స్వదేశీ పరిస్థితులను తప్పకుండా ఉపయోగించుకుంటారు

స్వదేశీ పరిస్థితులను తప్పకుండా ఉపయోగించుకుంటారు

ఆస్ట్రేలియన్లు స్వదేశీ పరిస్థితులను తప్పకుండా ఉపయోగించుకుంటారని వాట్సన్ అన్నాడు. గతేడాది యూఏఈలో జరిగిన టీ20 టోర్నమెంట్లో టీమిండియా టైటిల్ ఫేవరెట్‌‌గా బరిలోకి దిగినప్పటికీ.. లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఇకపోతే ఆస్ట్రేలియా టోర్నీ ఆసాంతం రాణించి.. టైటిల్ గెలుపొందింది. ఇకపోతే వాట్సన్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా లెజెండ్స్ గురువారం షహీద్ వీర్ నారాయణ్ సింగ్‌లో జరిగిన సెమీ ఫైనల్‌లో ఇండియా లెజెండ్స్‌ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. డెత్ ఓవర్లలో నమన్ ఓజా, ఇర్ఫాన్ పఠాన్‌లు వీరవిహారం చేయడంతో జట్టును ఫైనల్‌కు చేర్చారు. చివరి మూడు ఓవర్లలో 36పరుగులు అవసరం కాగా.. పఠాన్ అజేయంగా 12 బంతుల్లో 37 పరుగులు చేయడంతో 172పరుగుల ఛేదనలో ఇండియా సక్సెస్ అయింది.

అదే ఇరు జట్ల మధ్య బిగ్గెస్ట్ తేడా

అదే ఇరు జట్ల మధ్య బిగ్గెస్ట్ తేడా

తన జట్టు ప్రదర్శనను, మ్యాచ్‌లో తాము పట్టు తప్పిన విషయాన్ని వాట్సన్ ప్రస్తావించాడు. ఇర్ఫాన్ పఠాన్ నాక్ ఇరు జట్ల మధ్య బిగ్గెస్ట్ తేడా అని పేర్కొన్నాడు. 'ఇది నిజంగా మంచి క్రికెట్ మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. మేము ఈ మ్యాచ్‌లో కొన్ని సార్లు పైచేయిలో ఉన్నాం. అయితే టీమిండియాకు అదృష్టవశాత్తూ భారత బ్యాటర్ ఇర్ఫాన్ పఠాన్ చివర్లో వచ్చి చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్ చివరి వరకు సరిసమానంగా జరిగింది. ఈ గేమ్‌ని చూసిన ప్రేక్షకులు థ్రిల్లయి ఉంటారని చెప్పొచ్చు.' అని వాట్సన్ అన్నాడు.

Story first published: Friday, September 30, 2022, 15:35 [IST]
Other articles published on Sep 30, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X