న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీ రనౌట్.. మాకు అవమానం: ఆసీస్ దిగ్గజం

Shane Warne Tweets Shame For Us Cricket Lovers on Virat Kohlis Run-Out In Adelaide
India vs Australia 1st Test : Virat Kohli Run Out 'Shame' : Shane Warne | Rahane Gets Trolled

అడిలైడ్‌ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే/నైట్ టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రనౌటవ్వడం క్రికెట్ లవర్స్ అందరికి అవమానకరమని దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అన్నాడు. విరాట్ రనౌటవ్వడం తనను తీవ్రంగా బాధించిందన్నాడు. ఇక బ్యాటింగ్‌కు ప్రతికూలమైన పిచ్‌పై ఓపికగా బ్యాటింగ్ చేసిన విరాట్ హాఫ్ సెంచరీతో జట్టును గట్టెక్కించాడు. తొలుత చతేశ్వర్ పుజారాతో ఆచితూచి ఆడిన కోహ్లీ.. అనంతరం అజింక్యా రహానేతో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 180 బంతుల్లో 74 పరుగులతో క్రీజులో పాతుకుపోయిన కోహ్లీ సెంచరీ చేస్తాడని అంతా భావించారు. కానీ అజింక్యా రహానే కారణంగా విరాట్ రనౌట్‌గా వెనుదిరిగాడు.

మ్యాచ్ టర్నింగ్ పాయింట్..

నాథన్ లయన్‌ వేసిన 77వ ఓవర్‌లో రహానే ఫ్లిక్‌ షాట్ ఆడి క్విక్ సింగిల్‌కు పిలుపునివ్వగా.. వికెట్ల మధ్య వేగంగా ఉంటే విరాట్ హాఫ్ పిచ్ దాటాడు. కానీ బంతిని హజెల్ వుడ్ అందుకోవడాన్ని గమనించిన రహానే వెనక్కి వెళ్లిపోవడంతో విరాట్ పిచ్ మధ్యలోనే ఆగిపోయాడు. ఈ లోపు హజల్ వుడ్ బంతిని లయన్‌కు అందించడంతో విరాట్ రనౌట్ కాకతప్పలేదు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 88 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇదే మ్యాచ్‌ను ఆసీస్ వైపు టర్న్ చేసింది.

క్రికెట్ లవర్స్ అందరికీ..

క్రికెట్ లవర్స్ అందరికీ..

కోహ్లీ రనౌట్‌తో భారత అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక ఆసీస్‌ దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ కూడా ఈ రనౌట్‌పై ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘కోహ్లీ రనౌట్‌ కావడం నిరాశకు గురిచేసింది. అతను క్రీజులోకి వచ్చినప్పుడే పెద్ద ఇన్నింగ్స్‌ ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఆ దిశగా దూసుకెళ్తున్న కోహ్లీ అనూహ్యంగా రనౌట్‌ కావడం బాధాకరం. ఇది క్రికెట్ ప్రేమికులందరికీ అవమానం' అని ట్వీట్‌ చేశాడు.

రహానే‌పై నెటిజన్ల ఫైర్..

రహానే‌పై నెటిజన్ల ఫైర్..

ఇక కోహ్లీ ఔటైన కొద్దిసేపటికే రహానే ఔటవ్వడంతో అప్పటి వరకు పటిష్టంగా కనిపించిన భారత్ ఒక్కసారిగా బలహీనంగా మారింది. దాంతో రహానేపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి సాగుతున్న ఇన్నింగ్స్‌ను నాశనం చేసావ్ కదా? అని మండిపడుతున్నారు. అంతేకాకుండా కోహ్లీ రనౌట్ చేసే బదులు.. త్యాగం చేస్తే సరిపోయేది కదా! అని కామెంట్ చేస్తున్నారు. ఇక మాజీ క్రికెటర్లు, విశ్లేకులు కూడా విరాట్ కోసం త్యాగం చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన కోహ్లీ రనౌట్ కాకుంటే సెంచరీ చేసేవాడని కామెంట్ చేస్తున్నారు.

244 ఆలౌట్..

244 ఆలౌట్..

వెనువెంటనే ఈ ఇద్దరి వికెట్లు కోల్పోవడం భారత్ తొలి రోజు ఆట ముగిసేసరికి 89 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. కోహ్లీ (180 బంతుల్లో 74; 8 ఫోర్లు) భారత ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. పుజారా (160 బంతుల్లో 43; 2 ఫోర్లు), రహానే (92 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఇక 233/6 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 11 పరుగులు మాత్రమే చేసి 244 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్, సాహా తీవ్రంగా నిరాశపరచగా.. టెయిలండర్లు ఉమేశ్ యాదవ్, షమీ పోరాడలేకపోయారు.

Story first published: Friday, December 18, 2020, 11:16 [IST]
Other articles published on Dec 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X