న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్‌ vs లారా.. ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మెన్ ఎవరో చెప్పిన వార్న్‌!!

Shane Warne says Tendulkar is my batsman to bat in any conditions, Steve was a match saver

మెల్‌బోర్న్‌: క్రికెట్ ప్రపంచంలో టీమిండియా ఆటగాడు స‌చిన్ టెండూల్క‌ర్‌, వెస్టిండీస్ ప్లేయర్ బ్రియాన్ లారాల‌ను దిగ్గ‌జాలుగా పరిగ‌ణిస్తున్నారు. ఈ దిగ్గజాలు ఆడిన కాలంలో అనేక రికార్డుల్లో పోటీ వీరి మధ్యే ఉండేది. అయితే సచిన్, లారాలలో ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మన్‌ ఎవరని అడిగితే మాజీలు తమతమ అభిప్రాయాలను తెలిపారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ కూడా తన ఫేవరేట్ ఎవరో చెప్పాడు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థులపై పైచేయి సాధించే బ్యాట్స్‌మన్‌ను ఎంచుకోమంటే సచిన్‌ను ఎంచుకుంటానన్నాడు.

కరోనా ఎఫెక్ట్.. విజేతకు టాయిలెట్‌ పేపర్‌!!కరోనా ఎఫెక్ట్.. విజేతకు టాయిలెట్‌ పేపర్‌!!

సచిన్‌నే ఎంచుకుంటా:

సచిన్‌నే ఎంచుకుంటా:

సోమవారం షేన్‌ వార్న్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా స‌చిన్‌, లారాల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్యాలు చేశాడు. అతడు ఆడిన సమయంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ గురించి మాట్లాడాడు. 'ఎలాంటి పరిస్థితుల్లోనైనా సత్తాచాటే బ్యాట్స్‌మన్‌ను ఎంచుకోవాలంటే.. సచిన్, లారాలో ఎవరిని ఎంపిక చేయాలని కాస్త తడబడతా. అయితే నేను సచిన్‌నే ఎంచుకుంటా. అదే టెస్టు ఆఖరి రోజు 400 పరుగులు చేయాల్సి వస్తే లారాను తీసుకుంటా. ఇద్దరూ అద్భుతమైన ఆటగాళ్లు' అని వార్న్‌ అన్నాడు.

400 ప‌రుగుల రికార్డు లారాపైనే:

400 ప‌రుగుల రికార్డు లారాపైనే:

టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో 400 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు చేసిన ఏకైక క్రికెట‌ర్‌గా లారాపైనే రికార్డు ఉంది. 16 ఏళ్ల కింద‌ట లారా నెల‌కొల్పిన ఈ రికార్డు, ఇప్ప‌టికీ చెక్కు చెద‌ర‌లేదు. మ‌రోవైపు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అనేక రికార్డులు స‌చిన్ పేరిటే ఉన్నాయి. టెస్టుల్లో 51 సెంచ‌రీలు, వన్డేల్లో 49 శ‌త‌కాలు సచిన్ నెలకొల్పాడు. 200 టెస్టులు, 461 వ‌న్డేలు, ఈ రెండు ఫార్మాట్ల‌లో అత్య‌ధిక ప‌రుగులు ఇలా అనేక రికార్డులు స‌చిన్ సొంతం. ఇక వార్న్‌ టెస్టుల్లో 708, వన్డేల్లో 293 వికెట్లు తీశాడు.

స్టీవ్‌ మ్యాచ్‌ విజేత:

స్టీవ్‌ మ్యాచ్‌ విజేత:

ఆసీస్ మాజీ సారథి స్టీవ్‌ వా గురించి కూడా వార్న్‌ మాట్లాడాడు. స్టీవ్‌ను మ్యాచ్‌ విజేత అని అనడం కంటే మ్యాచ్‌ను కాపాడేవాడిగా పేర్కొనాలని అభిప్రాయపడ్డాడు. అయితే అతడు అలెన్‌ బోర్డర్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసిన ఆస్ట్రేలియన్‌ టెస్టు XI జట్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ లేకపోవడానికి కారణం తెలిపాడు. అతడు కలిసి ఆడిన ఆటగాళ్లను మాత్రమే ఎంచుకున్నానని, అందుకే వార్నర్‌ను ఎంపిక చేయలేదని తెలిపాడు. ఆసీస్‌ గొప్ప ఓపెనర్లలో వార్నర్‌ ఒకరని కొనియాడాడు.

Story first published: Tuesday, March 31, 2020, 10:29 [IST]
Other articles published on Mar 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X