న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్టీవ్‌ స్మిత్‌కి కెప్టెన్సీ ఇవ్వొద్దు: వార్న్

Shane Warne says Steve Smith should focus on batting and not regaining captaincy

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ సారధ్య బాధ్యతలు బాగానే మోస్తున్నాడు, మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌కి మళ్లీ జట్టు పగ్గాలు ఇవ్వొద్దని దిగ్గజ స్పిన్నర్ షేన్‌ వార్న్ సూచించాడు. పరుగులు చేస్తున్నంత కాలం పైన్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలన్నాడు. స్మిత్‌ని కేవలం బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే చూడాలనుకుంటున్నానని వార్న్ పేర్కొన్నాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో స్మిత్‌పై ఏడాది నిషేధం విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. రెండేళ్ల వరకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలిగించిన విషయం తెలిసిందే.

అక్మల్ కెరీర్‌పై ఎవరూ ఏమీ చేయలేం.. ఇక అతని చేతుల్లోనే అంతా ఉంది: కోచ్అక్మల్ కెరీర్‌పై ఎవరూ ఏమీ చేయలేం.. ఇక అతని చేతుల్లోనే అంతా ఉంది: కోచ్

ఏడాది నిషేధం తర్వాత రీ ఎంట్రీలో అదరగొడుతున్న స్టీవ్ స్మిత్.. కెప్టెన్సీపై విధించిన బ్యాన్‌ కూడా ఆదివారం ( మార్చి 29)తో ముగిసిపోయింది. ఆస్ట్రేలియా వన్డే, టీ20 జట్టుకి ప్రస్తుతం అరోన్ ఫించ్ కెప్టెన్‌గా ఉండగా.. టెస్టు జట్టుని టిమ్ పైనీ ఉన్నాడు. ఇద్దరూ గత రెండేళ్లలో ఆశించిన మేర రాణించలేకపోవడంతో.. మళ్లీ స్మిత్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని ఆ దేశ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే వార్న్ మాత్రం వద్దంటున్నాడు.

తాజాగా షేన్‌ వార్న్ స్కై స్పోర్ట్స్ ఛానెల్‌తో మాట్లాడుతూ... 'ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్ ఎంపికవడం లాంఛనంగానే కనిపిస్తోంది. కానీ.. నేను సెలక్టర్‌గా ఉంటే మాత్రం అతడి మళ్లీ కెప్టెన్సీ ఇవ్వను. నేను ఇప్పుడు స్మిత్‌ని కేవలం బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే చూడాలనుకుంటున్నా. ఇతర విషయాల గురించి ఆందోళన చెందడం లేదు. కెప్టెన్సీ రూపంలో అతనిపై అదనపు భారాన్ని మోపాలని అనుకోవడం లేదు' అని వార్న్ అన్నాడు.

'స్మిత్ కేవలం బ్యాటింగ్ చేయాలనుకుంటున్నా. అతను మైదానంలో నాయకుడే. కానీ.. కెప్టెన్ కావాలని నేను కోరుకోవట్లేదు. పరుగులు చేస్తున్నంత కాలం నేను పైన్‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తా. కెప్టెన్‌గా తన బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తున్నాడు. పైన్ పరుగులు చేయకపోతే పరిస్థితి వేరేలా ఉండేది. అప్పడు స్మిత్‌ను పరిగణలోకి తీసుకోవచ్చు. ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్ లాంటి వారు కూడా కెప్టెన్సీకి అర్హులే' అని వార్న్ చెప్పుకొచ్చాడు.

రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌‌కు యత్నించి స్మిత్, డేవిడ్ వార్నర్, బెన్‌క్రాఫ్ట్ అడ్డంగా దొరికిపోయి యావత్ క్రికెట్ ప్రపంచ ముందు దోషులుగా నిలబడిన విషయం తెలిసిందే. సూత్రదారి డేవిడ్ వార్నర్, బెన్‌క్రాఫ్ట్ అయినా.. ఈ తప్పుడు చర్యను కెప్టెన్‌గా ప్రోత్సహించినందుకు స్మిత్ కూడా శిక్షార్హుడయ్యాడు. ముగ్గురు తమ తప్పిదం ఒప్పుకోవడం క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు తీసుకుంది.

Story first published: Wednesday, April 1, 2020, 13:58 [IST]
Other articles published on Apr 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X