న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్టీవ్‌ వా మోస్ట్‌ సెల్ఫిష్‌ క్రికెటర్.. షేన్ వార్న్‌ సంచలన వ్యాఖ్యలు!!

Shane Warne said Steve Waugh easily the most selfish cricketer I played with

మెల్‌బోర్న్‌: ఇటీవల ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌పై విమర్శలు చేసిన షేన్‌ వార్న్‌.. తాజాగా మరో మాజీ కెప్టెన్‌ స్టీవ్ వా‌పై కూడా కామెంట్స్‌ చేశాడు. స్టీవ్ వా మోస్ట్‌ సెల్ఫిష్‌ క్రికెటర్ అని ఆసీస్ స్పిన్ దిగ్గజం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. గ‌తంలో అత‌ని కార‌ణంగా ఎంతోమంది స‌హ‌చ‌ర క్రికెటర్లు ర‌నౌట్లు అయ్యార‌ని చెప్పుకొచ్చాడు. స్టీవ్ వా ఆసీస్ తరఫున 168 టెస్టులు, 325 వన్డేలు ఆడాడు.

హర్భజన్‌ని కొట్టేందుకు హోటల్‌ గదికెళ్లా.. కానీ.. :అక్తర్‌హర్భజన్‌ని కొట్టేందుకు హోటల్‌ గదికెళ్లా.. కానీ.. :అక్తర్‌

సోష‌ల్ మీడియాలో సంద‌డి:

క‌రోనా వైర‌స్ మహమ్మారి కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రీడా కార్య‌క‌లాపాలు వాయిదా ప‌డ‌టంతో.. ఆట‌గాళ్లంద‌రూ సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్ ద్వారా పలువురు క్రికెటర్లు తన అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు షేన్ వార్న్ సూటిగా స‌మాధానమిచ్చాడు. స్టీవ్ వా అత్యంత స్వార్థ‌ప‌రుడ‌ని పేర్కొన్నాడు.

స్టీవ్‌ వా మోస్ట్‌ సెల్ఫిష్‌ క్రికెటర్:

స్టీవ్‌ వా మోస్ట్‌ సెల్ఫిష్‌ క్రికెటర్:

ఓ క్రికెట్ అభిమాని స్టీవ్ వా గురించి చెబుతూ... 104 ర‌నౌట్ల‌లో అతడు పాలుపంచుకున్నాడ‌ని పోస్టు చేశాడు. అందులో 73 సార్లు తన సహచర బ్యాటింగ్‌ పార్టనర్‌లే ఔట్‌ అయ్యారని పేర్కొంటూ ఒక కొంత‌మంది పేర్ల‌ను పేర్కొన్నాడు. దీన్ని ఉద్దేశిస్తూనే ఒక ప్రశ్నను వార్న్‌ను అడగ్గా.. అందుకు సమాధానంగా స్టీవ్‌ వా కచ్చితంగా స్వార్థ క్రికెటరే అని పేర్కొన్నాడు. తాను ఆడిన క్రికెటర్లలో స్టీవ్‌ వానే మోస్ట్‌ సెల్ఫిష్‌ అని అన్నాడు.

స్టీవ్ అంటే ద్వేషం లేదు:

స్టీవ్ అంటే ద్వేషం లేదు:

స్టీవ్ వా అంటే త‌న‌కేమీ ద్వేషం లేద‌ని స్ప‌ష్టం చేసిన వార్న్‌.. ఇటీవ‌లే త‌నకు ఆల్‌టైమ్‌ ఆస్ట్రేలియా టెస్టు ఎలెవ‌న్ జ‌ట్టులో చోటు క‌ల్పించిన‌ట్లు కూడా పేర్కొన్నాడు. త‌ను ఆడిన ఆట‌గాళ్ల‌లో స్టీవ్ వానే మోస్ట్ సెల్ఫిష్ ప్లేయ‌ర‌ని, ఇందుకు గ‌ణాంకాలే సాక్ష్య‌మ‌ని వార్న్‌ చెప్పుకొచ్చాడు. స్టీవ్‌ వా తన బ్యాటింగ్‌తో ఆసీస్‌కు ఎ‍న్నో విజయాలను అందించాడు. ఆసీస్‌కు ఒక ప్రపంచకప్‌ను కూడా సాధించి పెట్టిన ఘనత స్టీవ్‌ వాది. కానీ ఒక్క చెత్త రికార్డు స్టీవా పేరిట ఉంది. అది రనౌట్లలో భాగమైన రికార్డు.

ఆ ఓటమికి పాంటింగ్ కారణం:

ఆ ఓటమికి పాంటింగ్ కారణం:

2005 యాషెస్‌ సిరీస్‌ ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టు గురించి వార్న్‌ మాట్లాడుతూ... ఆనాటి మ్యాచ్‌లో తమ ఓటమికి అప్పటి కెప్టెన్ రికీ పాంటింగ్‌ తీసుకున్న నిర్ణయమే కారణమన్నాడు. బ్యాటింగ్‌ అనుకూలించే వికెట్‌పై టాస్‌ గెలిచిన పాంటింగ్‌ బౌలింగ్‌ ఎంచుకోవడం అతి పెద్ద తప్పు అని చెప్పుకొచ్చాడు. ఆ నిర్ణయం ఇంగ్లండ్‌కు మేలు చేయడంతోనే.. తాము రెండు పరుగుల తేడాతో ఓటమి పాలయ్యామన్నాడు. వార్న్‌ ఆసీస్ తరఫున 145 టెస్టులు, 194 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 708 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.

Story first published: Saturday, May 16, 2020, 15:27 [IST]
Other articles published on May 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X