న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అప్పట్లో నాకు లంచమివ్వజూపారు: షేన్ వార్న్

Shane Warne Recalls Bribery Offers, Relationships And Top Cricketers In His New Book

న్యూ ఢిల్లీ: ఇటీవల ఆసీస్‌ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌ స్టీవ్ వా స్వార్థపరడంటూ తన ఆత్మకథ 'నో స్పిన్‌'లో పేర్కొన్న షేన్‌ వార్న్‌.. మరో సంచలన విషయాన్ని బయటపెట్టాడు. తన క్రికెట్‌ కెరీర్‌లో ప్రత్యర్థి జట్టు క్రికెటర్‌ ఒకరు భారీ మొత్తం లంచం ఇవ్వడానికి యత్నించిన విషయాన్ని వార్న్‌ వెల్లడించాడు. ప్రధానంగా క్రికెటర్లతో ఉన్న రిలేషన్‌షిప్స్‌తో పాటు తన వైవాహిక జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు గురించి పేర్కొన్నాడు.

సలీం మాలిక్‌ లంచాన్ని ఆఫర్ చేసినట్లు

సలీం మాలిక్‌ లంచాన్ని ఆఫర్ చేసినట్లు

వార్న్‌.. 1994-95 సీజన్‌లో పాకిస్తాన్‌తో కరాచీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సలీం మాలిక్‌ లంచాన్ని ఆఫర్ చేసినట్లు తెలిపాడు. తాను ఆఫ్‌ స్టంప్‌ బంతులు వేయాలని కోరిన మాలిక్, అందుకు దాదాపు రెండు లక్షల యూఎస్‌ డాలర్లను ఇవ‍్వబోయాడన్నాడు. మరొక సందర్భంలో ఒక బుకీ కూడా తనను కొనుగోలు చేయడానికి యత్నించాడన్నాడు. అతను శ్రీలంకకు చెందిన బుకీగా వార్న్‌ పేర్కొన్నాడు.

పాక్ క్రికెటర్‌పై స్లెడ్జింగ్‌కు పాల్పడ్డ ఆస్ట్రేలియా క్రికెటర్లు

 ఎలిజిబెత్‌ హర్లీతో తెగతెంపులు

ఎలిజిబెత్‌ హర్లీతో తెగతెంపులు

ఒకానొక సమయంలో ఐదువేల డాలర్లను తాను పొగొట్టుకున్నానని, దాన్ని సహచర క్రికెటర్‌ మార్క్‌ వా ఇవ్వబోతే వద్దనన్నాడు. ఇదిలా ఉంచితే, తన వైవాహిక జీవితంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి వార్న్‌ వివరించాడు. ‘నా వైవాహిక జీవితం గురించి చెప్పుకోవాలంటే సిమోన్‌తో 10 ఏళ్ల దాంపత్యానికి ముగింపు పలకడం ఒకటైతే, అటు తర్వాత ఎలిజిబెత్‌ హర్లీతో తెగతెంపులు. ఈ రెండే నా వివాహ జీవితంలో చవిచూసిన చేదు జ్ఞాపకాలు. వారితో విడిపోయినప్పటికీ ఇప్పటికీ మేము మంచి ఫ్రెండ్స్‌గానే ఉన్నాం' అని వార్న్‌ పేర్కొన్నాడు.

స్టీవ్ వా పెద్ద స్వార్ణపరుడంటూ

స్టీవ్ వా పెద్ద స్వార్ణపరుడంటూ

ఇంకా ఆ పుస్తకంలో స్టీవ్ వా పెద్ద స్వార్ణపరుడంటూ షేన్ వార్న్ గత స్మృతులను గుర్తు చేసుకుంటున్నాడు. ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ స్వయంగా రాసిన తన ఆత్మకథలో స్టీవ్ వా స్వార్థపరుడని దీంతోనే జట్టు నుంచి దూరం చేశాడని పేర్కొన్నాడు. 1999వ సంవత్సరంలో ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిందట.

నీ గురించి నువ్వు ఆలోచించుకో

నీ గురించి నువ్వు ఆలోచించుకో

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన ఫార్మాట్‌లో మూడు టెస్టులు ఆడిన షేన్ వార్న్‌ను నాలుగైదు మ్యాచ్‌లు ఆడొద్దని తుది జట్టులో స్థానం దక్కించకుండా చేశాడు. 'నన్ను చూసి కుళ్లు పెట్టుకుని నేనెలా ఉండాలనుకుంటున్నాను. ఎలా ప్రవర్తిస్తాను. జీవన విధానం ఎలా ఉంటుందోననే విషయాలు గమనించేవాడు. ఈ ప్రవర్తనాశైలిపై చిరాకు పుట్టి ఓ సారి 'నీ గురించి ఆలోచించుకో' అని ఓ సారి చెప్పేశాను.

Story first published: Wednesday, October 10, 2018, 11:01 [IST]
Other articles published on Oct 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X