న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ క్రికెటర్‌పై స్లెడ్జింగ్‌కు పాల్పడ్డ ఆస్ట్రేలియా క్రికెటర్లు

When Australian cricket team sledged, I turned a deaf ear: Haris Sohail

న్యూ ఢిల్లీ: దుబాయ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు తనని స్లెడ్జింగ్‌తో ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారని పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ హరీశ్ సొహైల్ ఆరోపించాడు. గత ఆదివారం మొదలైన ఈ టెస్టు మ్యాచ్‌లో 240 బంతుల్లో హరీశ్ సోహైల్ (110) 8 ఫోర్లు, 2సిక్సు), 208 బంతుల్లో మహ్మద్ హఫీజ్ (126) 15ఫోర్లు) సెంచరీలు బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 164.2 ఓవర్లలో 482 పరుగులకి ఆలౌటైంది.

'కోహ్లీ తప్ప ఎంటర్‌టైనర్సే కనిపించడం లేదు''కోహ్లీ తప్ప ఎంటర్‌టైనర్సే కనిపించడం లేదు'

అమాయకుడ్ని.. నాపై స్లెడ్జింగ్‌కి:

అమాయకుడ్ని.. నాపై స్లెడ్జింగ్‌కి:

2015 నుంచి మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్న సోహైల్.. ఇటీవల మళ్లీ ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి వచ్చాడు. ‘నేను అమాయకుడ్ని (నవ్వుతూ).. కానీ.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు నాపై స్లెడ్జింగ్‌కి (అసందర్భ పదజాలం వాడటం) ప్రయత్నించారు. దీంతో.. బ్యాటింగ్ చేస్తున్నంతసేపు వారివైపు చూడటం మానేశాను. అయినప్పటికీ రెండు మూడు సార్లు వారు స్లెడ్జింగ్‌కి ట్రై చేశారు. ఆఖరిగా.. నేను వారి మాటలు విననట్లే నటించాను.'

మూడేళ్లుగా గాయంతో బాధపడ్డా:

మూడేళ్లుగా గాయంతో బాధపడ్డా:

'మూడేళ్లుగా గాయంతో నేను బాధపడ్డాను. చాలా అంశాలు నాకు ప్రతికూలంగా జరిగాయి. అయినప్పటికీ.. పట్టుదలతో ఫిట్‌నెస్ సాధించి.. మళ్లీ జట్టులోకి పునరాగమనం చేయడం ఆనందంగా ఉంది 'అని సోహైల్ వెల్లడించాడు. సొహైల్‌కు 2015వ సంవత్సరంలో మోకాలి గాయం వల్ల రెండేళ్లు విరామం తీసుకున్నాడు. ఆ తర్వాత ఫిట్‌నెస్ సాధించి పునరాగమనం చేశాడు.

సెంచరీ చేసి జట్టుకు పరుగులు జోడిస్తే

సెంచరీ చేసి జట్టుకు పరుగులు జోడిస్తే

ఈ సందర్భంగా మాట్లాడిన సొహైల్.. మోకాలి గాయం కారణంగా నేను పడిన ఇబ్బందులు ఎవరికీ తెలియవు. దాని నుంచి బయటపడేందుకు చాలా కష్టపడ్డాను. కానీ, దేశం తరపున ఆడుతున్నామనే భావన ముందు అన్నీ పటాపంచలైపోతాయి. అదే సమయంలో ఓ సెంచరీ చేసి జట్టుకు పరుగులు జోడిస్తే.. అంతకుమించిందేమీ ఉండదనుకుంటా..

కొత్త బంతిని తీసుకుంటే పరుగులు చేద్దామని

కొత్త బంతిని తీసుకుంటే పరుగులు చేద్దామని

'పిచ్‌పై పరుగులు చేయడమే కష్టంగా ఉన్న సమయంలో తొలి ఇన్నింగ్స్‌లో మాకు కావలసినన్ని పరుగులు సాధించేశాం. ఈ ఇన్నింగ్స్ చాలా చక్కగా జరిగిందనే అనుకుంటున్నాం. ఒకానొక దశలో బాల్ పూర్తిగా సున్నితంగా మారిపోయింది. పరుగులు చేయడానికి వీల్లేనంతగా మారింది. వాళ్లు బంతి మార్చేందుకు కూడా యత్నించలేదు. మేమేంతా వారు కొత్త బంతిని తీసుకుంటే పరుగులు చేద్దామని ఎదురుచూస్తూ ఉన్నాం.

Story first published: Wednesday, October 10, 2018, 10:05 [IST]
Other articles published on Oct 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X