న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ కన్నా అతడే గొప్ప ఆటగాడు: షేన్ వార్న్ చెప్పిన సత్యం

By Nageshwara Rao
Shane Warne rates Steven Smith higher than Virat Kohli in Tests

హైదరాబాద్: ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ తనకు ప్రస్తుత క్రికెటర్లలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అంటే ఇష్టమని అన్నాడు. తాజాగా క్రికెట్.కామ్.ఏయుకి రాసిన న్యూస్ కార్ప్ కాలమ్‌లో విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్‌లలో అద్భుతంగా రాణిస్తున్నాడని, అయినా కోహ్లీ కంటే టెస్టుల్లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ గొప్ప ఆటగాడని అభిప్రాయపడ్డాడు.

ప్రపంచంలోని టాప్-11 ఆటగాళ్లను ఎంచుకున్న వార్న్ ఆ జాబితాలో స్మిత్‌కు పదో స్ధానాన్ని కల్పించాడు. వార్న్ జాబితాలో వెస్టిండిస్ క్రికెట్ లెజెండ్ సర్ వివ్ రిచర్డ్స్, బ్రియాన్ లారా తొలి రెండు స్ధానాల్లో ఉండగా... మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కి మూడో స్థానం కల్పించాడు.

ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా క్రికెటర్లు గ్రెగ్ చాపెల్, రికీ పాంటింగ్, అలెన్ బోర్డర్లకు చోటిచ్చాడు. దక్షిణాఫ్రికా క్రికెటర్లు జాక్వస్ కల్లిస్, ఏబీ డివిలియర్స్‌కు ఏడు, తొమ్మిది స్థానాల్లో చోటు కల్పించాడు. ఇక, ఇంగ్లాండ్ ఆల్ టైమ్ గ్రేట్ గ్రాహమ్ గూచ్‌కి ఎనిమిదో స్థానం... స్మిత్‌కు పదో స్థానం, విరాట్‌ కోహ్లీకి 11వ స్థానం ఇస్తున్నట్లు వార్న పేర్కొన్నారు.

తన కలల జట్టులో వెస్టిండిస్ నుంచి ఇద్దరు, భారత్ నుంచి ఇద్దరు, ఆస్ట్రేలియా నుంచి నలుగురు, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు, ఇంగ్లాండ్ నుంచి ఒకరికి చోటు కల్పించాడు. ఈ జాబితాలో కోహ్లీకి 11వ స్ధానం కల్పించడంపై వార్న్ స్పందించాడు. 2014లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో విరాట్ కోహ్లీ కాస్త పేలవ ప్రదర్శన కనబరిచాడు.

ఒక ఆటగాడు తనను తాను నిరూపించుకోవాలంటే విభిన్న పిచ్‌లు కలిగిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌‌, భారత్‌ దేశాలలో అద్బుత ఆటను కనబర్చిన వారిని అత్యుత్తమ అటగాళ్లుగా పరిగణిస్తారని అన్నాడు. 2014 ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో కోహ్లీ ఘోరంగా విఫలమైన చోట స్మిత్‌ రాణించాడని చెప్పాడు.

Shane Warne rates Steven Smith higher than Virat Kohli in Tests

ఈ మేరకు గతంలో యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్ పిచ్‌లపై స్మిత్‌ సాధించిన మూడు సెంచరీలను ఈ సందర్భంగా వార్న్ ప్రస్తావించాడు. తన దృష్టిలో ఆ ఒక్క సిరీస్‌ కారణంగానే కోహ్లీని వెనక్కి నెట్టి స్మిత్‌ ఆగ్రస్థానంలో కోనసాగుతున్నాడని పేర్కోన్నారు.

షేన్ వార్న్ 10 అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ జాబితా:
1. వివ్ రిచర్డ్స్ (వెస్టిండిస్)
2. బ్రియాన్ లారా (వెస్టిండిస్)
3. సచిన్ టెండూల్కర్ (ఇండియా)
4. గ్రెగ్ ఛాపెల్ (ఆస్ట్రేలియా)
5. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)
6. అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా)
7. జాక్వస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా)
8. గ్రాహమ్ గూచ్ (ఇంగ్లాండ్)
9. ఏబీ డివిల్లియర్స్ (దక్షిణాఫ్రికా)
10. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)/విరాట్ కోహ్లీ (ఇండియా)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 22, 2017, 22:06 [IST]
Other articles published on Dec 22, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X