న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్టీవ్ వా.. స్వార్థంతోనే మ్యాచ్‌కి దూరం చేశాడు: షేన్ వార్న్

Shane Warne lashes at selfish Steve Waugh

న్యూఢిల్లీ: స్టీవ్ వా పెద్ద స్వార్ణపరుడంటూ షేన్ వార్న్ గత స్మృతులను గుర్తు చేసుకుంటున్నాడు. ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ స్వయంగా రాసిన తన ఆత్మకథలో స్టీవ్ వా స్వార్థపరుడని దీంతోనే జట్టు నుంచి దూరం చేశాడని పేర్కొన్నాడు. 1999వ సంవత్సరంలో ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిందట. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన ఫార్మాట్‌లో మూడు టెస్టులు ఆడిన షేన్ వార్న్‌ను నాలుగైదు మ్యాచ్‌లు ఆడొద్దని తుది జట్టులో స్థానం దక్కించకుండా చేశాడు.

 జట్టులోకి ఎందుకు తీసుకోలేదని:

జట్టులోకి ఎందుకు తీసుకోలేదని:

దానికి స్పందించిన షేన్ వార్న్.. 'స్టీవ్ వా నన్ను జట్టులోకి ఎందుకు తీసుకోలేదా అని బాధపడలేదు. ఆట తీరు బాగుండకపోతే తీసేయడం కెప్టెన్ బాధ్యత. కానీ, నేను బౌలింగ్ చక్కగానే వేస్తున్నాను కదా. అప్పుడు అర్థమైంది. అతను నామీద అసూయతోనే అలా చేశాడన్న సంగతి అప్పుడే తెలుసుకున్నా. ఆ తర్వాత చాలాసార్లు నేను తినే పదార్థాలను గమనించడం మొదలుపెట్టాడు.'

నీ గురించి ఆలోచించుకో

నీ గురించి ఆలోచించుకో

''నన్ను చూసి కుళ్లు పెట్టుకుని నేనెలా ఉండాలనుకుంటున్నాను. ఎలా ప్రవర్తిస్తాను. జీవన విధానం ఎలా ఉంటుందోననే విషయాలు గమనించేవాడు. ఈ ప్రవర్తనాశైలిపై చిరాకు పుట్టి ఓ సారి 'నీ గురించి ఆలోచించుకో' అని ఓ సారి చెప్పేశాను.'' అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నాడు.

 నువ్వు తర్వాతి టెస్టుకు జట్టులో ఉండవ్

నువ్వు తర్వాతి టెస్టుకు జట్టులో ఉండవ్

ఇంకా ఆ తర్వాత నాలుగైదు టెస్టులు మ్యాచ్‌లకు తుది జట్టు ఎంపికల సమయంలో.. 'సెలక్షన్ కమిటీ ముందు నాలుగైదు టెస్ట్ మ్యాచ్‌లకు వైస్ కెప్టెన్‌గా నేను.. కెప్టెన్‌గా స్టీవ్ వాతో కలిసి జాఫ్ మార్ష్ ముందు సమావేశమయ్యాం. మార్ష్ నన్ను.. నువ్వు తర్వాతి టెస్టుకు జట్టులో ఉండవని అన్నాడు. దానికి కారణమేంటని మరికొందరితో పాటు కలిసి నేనడిగితే.. దానికి స్పందించిన స్టీవ్ వా.. ఈ మ్యాచ్ కు నువ్వుండవు. నాలుగో టెస్టులో షేన్ వార్న్ లేకుండానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశాడు.'

సహచరుడే నా ప్రతిభను గుర్తించకపోతే

సహచరుడే నా ప్రతిభను గుర్తించకపోతే

ఆ సిరీస్‌ను గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో ఆ తర్వాత షేన్ వార్న్ లేడు. 'అప్పటి నేను పడిన బాధకు అసంతృప్తి అనేది చాలా చిన్న పదమైపోతుందేమో. నా సహచరుడే నా ప్రతిభను గుర్తించకపోతే చాలా బాధనిపించి కుంగిపోయాను. నా పట్ల నేను చాలా చెడుగా ప్రవర్తించాను. జట్టుకు సహకారం అందించడంలోనూ దూరంగా ఉండిపోయాను' అని తెలిపాడు.

Story first published: Monday, October 1, 2018, 17:20 [IST]
Other articles published on Oct 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X