న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేనే సెలక్టర్ అయితే విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పిస్తా: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

Shane Lee feels Indian players appear a bit scared under Virat Kohli’s captaincy
Indian Players Scared Under #ViratKohli, Team Relaxed Under #AjinkyaRahane - Shane Lee

సిడ్నీ: తానే టీమిండియా సెలెక్టర్ అయితే విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించేవాడినని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్, బ్రెట్ లీ సోదరుడు షేన్ లీ అన్నాడు. కోహ్లీని బ్యాటింగ్‌పై మరింతగా దృష్టి సారించమని చెప్పి, అజింక్యా రహానేకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే వాడినని తెలిపాడు. ఇక కోహ్లీ సారథ్యంలో ఆడేందుకు భారత ఆటగాళ్లు భయపడతారని, అదే సమయంలో అజింక్యా రహానే కెప్టెన్సీలో మాత్రం స్వేచ్ఛగా ఆడతారని అభిప్రాయపడ్డాడు.

ఆసీస్ పర్యటనలో అడిలైడ్ ఘోర పరాజయం తర్వాత విరాట్ స్వదేశం తిరిగిరావడంతో తాత్కలిక సారథిగా జట్టు పగ్గాలు అందుకున్న అజింక్యా రహానే సూపర్ కెప్టెన్సీతో చారిత్రాత్మక విజయాన్నందించాడు. దాంతో టెస్టు కెప్టెన్సీపై భిన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఈ నేపథ్యంలో షేన్‌ లీ తన సోదరుడు బ్రెట్‌ లీతో జరిగిన చిట్‌చాట్‌లో విరాట్ కెప్టెన్పీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

విరాట్‌కు భయపడుతున్నారు..

విరాట్‌కు భయపడుతున్నారు..

'విరాట్ కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మన్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కెప్టెన్‌గా ఉన్నందున టీమిండియా సభ్యులకు అతనంటే విపరీతమైన గౌరవం ఉంటుంది. అయితే అదే సమయంలో అతనికి వారు భయపడినట్లు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే కోహ్లీ ప్రొఫెషనలిజంకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. కచ్చితమైన ఫలితాలు కావాలంటాడు. రహానే ఈ అంశాలకు విలువనిస్తూనే ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడేలా స్వేచ్ఛనిస్తాడు.

కాలమే నిర్ణయిస్తుంది..

కాలమే నిర్ణయిస్తుంది..

నేను గనుక టీమిండియా సెలక్టర్‌ అయితే రహానేను సారథిని చేసి, కోహ్లీని కేవలం బ్యాటింగ్‌పై ఫోకస్‌ చేయమని చెప్పేవాడిని. కోహ్లీ జోష్‌లో ఉంటే జట్టు కూడా అదే స్థాయిలో మెరుగ్గా రాణిస్తుంది. అయితే ఇలాంటి ఒక పరిణామం జరుగుతుందా? లేదా అన్న విషయాన్ని కాలమే నిర్ణయిస్తుంది.'అని షేన్‌ లీ చెప్పుకొచ్చాడు. కాగా ఆసీస్‌ తరఫున షేన్‌ లీ 45 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇక టీమిండియా ప్రస్తుతం విరాట్‌ కోహ్లి నేతృత్వంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతోంది.

ఒక్క సెంచరీ లేదు..

ఒక్క సెంచరీ లేదు..

గతేడాది విరాట్ కోహ్లీకి కలిసి రాలేదు. మూడు ఫార్మాట్లలో కనీసం ఒక్క సెంచరీ కూడా అతను చేయలేకపోయాడు. ఫిబ్రవరిలో న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్​లో ఓడిపోవడం, ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్​ ఓటమి, అనంతరం పింక్ టెస్టు ఓటమితో కోహ్లీ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దానికి తోడు అతని గైర్హాజరీలో జట్టును నడిపించిన రహానే చారిత్రాత్మక విజయాన్నందించడంతో కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు మరీ ఎక్కువయ్యాయి.

దీనికి తోడు ఐపీఎల్ టైటిల్ కొరత కూడా కోహ్లీ సారథ్యానికి మయాని మచ్చగా నిలుస్తోంది. ఆస్ట్రేలియా గడ్డపై రహానే సారథ్యంలో చారిత్రక టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియా ఇంగ్లండ్​తో సిరీస్​ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఈ నెల 5న చెన్నై వేదికగా ఇరుజట్లు తొలి టెస్టులో తలపడనున్నాయి.

Story first published: Monday, February 1, 2021, 17:45 [IST]
Other articles published on Feb 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X