న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: ముంబై కోచ్ సూచన.. ఐపీఎల్ ముందు హార్దిక్‌ మ్యాచ్‌లు ఆడాలి!!

Shane Bond says Hope Hardik Pandya gets to play some cricket before IPL

ముంబై: మార్చి 29 నుంచి పార్రంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)కు ముందు టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కొన్ని మ్యాచ్‌లు ఆడాలని ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ సూచించారు. గత కొంతకాలంగా వెన్ను గాయంతో సతమవుతున్న హార్దిక్‌ పాండ్యా విదేశాల్లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో గతేడాది సెప్టెంబరు నుండి జట్టుకు దూరమైయ్యాడు. గాయం నుండి కోలుకుంటూ.. నెల క్రితమే తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.

న్యూజిలాండ్‌తో తొలి టెస్టు.. మయాంక్‌కు జతగా ఆడేదెవరో చెప్పిన కోహ్లీ!!న్యూజిలాండ్‌తో తొలి టెస్టు.. మయాంక్‌కు జతగా ఆడేదెవరో చెప్పిన కోహ్లీ!!

శస్త్రచికిత్స అనంతరం నాలుగు నెలలు గడిచినా ఇప్పటికీ పాండ్యా ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతో భారత్ సెలక్టర్లు అతడ్ని పక్కనపెట్టేశారు. ఇక చేసేదేంలేక ఐపీఎల్ 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే పాండ్యా నిర్ణయంపై కోచ్ షేన్ బాండ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐపీఎల్-13కు ముందే పాండ్యా మ్యాచులు ఆడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

'ఐపీఎల్‌కి ముందు పాండ్యా కొన్ని మ్యాచ్‌లు ఆడాలని కోరుకుంటున్నా. పాండ్యా సామర్థ్యంపై నాకెలాంటి సందేహాలు లేవు. అయితే గాయం నుంచి కోలుకుని నేరుగా వచ్చి ఐపీఎల్‌లో ఆడటం ఇబ్బందిగా అనిపించొచ్చు. ఈ కారణంతోనే టోర్నీకి ముందు కొన్ని మ్యాచ్‌‌లు ఆడితే బాగుంటుంది. ఫామ్ నిరూపించుకునేందుకు ఐపీఎల్ ఓ మంచి వేదిక' అని బాండ్ చెప్పుకొచ్చారు.

ఇటీవలే మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ మాత్రం మరోలా స్పందించారు. 'ఐపీఎల్‌కు ఇంకా ఎంతో సమయం ఉంది. అప్పటిలోగా హార్దిక్‌ పాండ్యా 120 శాతం ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే.. గాయాలతో జట్టుకు దూరమైన తర్వాత పునరాగమనం ముఖ్యం కాదు. జట్టులో ప్రదర్శన ఏ స్థాయిలో ఉందనేదే పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే పాండ్యాకు ఇప్పుడు ఓపిక అవసరం' అని అన్నారు.

ఇటీవల లండన్‌లో సాధారణ చెకప్‌ చేయించుకున్న పాండ్యా.. ప్రస్తుతం బెంగుళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. వెన్నుగాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పాండ్యా.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాండ్యా గాయంతో శివమ్ దూబే‌క జట్టులోకి వచ్చాడు. అయితే దూబే అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో హార్దిక్ పాండ్యా రీఎంట్రీ సుగమమైంది. అయితే ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంది.

Story first published: Wednesday, February 19, 2020, 17:51 [IST]
Other articles published on Feb 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X