సర్ఫరాజ్‌కు ఘోర అవమానం: సెల్ఫీ అడిగి మరీ 'పంది' అని తిట్టిన అభిమాని (వీడియో)

ICC Cricket World Cup 2019 : Pak Fan Calls Sarfaraz As 'A Pig' In Front Of His Son || Oneindia

హైదరాబాద్: పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు ఘోర అవమానం ఎదురైంది. ప్రపంచకప్‌లో భాగంగా గత ఆదివారం(జూన్ 16)న మాంచెస్టర్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 89 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అనంతరం 337 పరుగుల లక్ష్య చేధనలో పలుమార్లు వరుణుడు అంతరాయం కలిగించడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను 40 ఓవర్లకు కుదించారు. దీంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం పాకిస్థాన్‌కు 40 ఓవర్లలో 302 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే, పాకిస్థాన్ నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేసింది.

పాక్ ఆటగాళ్లపై సర్వత్రా విమర్శలు

పాక్ ఆటగాళ్లపై సర్వత్రా విమర్శలు

ఈ ఓటమితో పాక్ ఆటగాళ్లపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఆ జట్టుపై పాక్ అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు. పలువురు నెటిజన్లు అయితే, పాక్ జట్టులోని ఆటగాళ్లను అసభ్య పదాలతో దూషించారు కూడా. టోర్నీలో భాగంగా పాకిస్థాన్ తన తదుపరి మ్యాచ్‌ని జూన్ 23న దక్షిణాఫ్రికాతో ఆడనుంది.

23న దక్షిణాఫ్రికాతో మ్యాచ్

23న దక్షిణాఫ్రికాతో మ్యాచ్

ఈ మ్యాచ్‌కి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమిస్తోంది. ఈ మ్యాచ్‌కి ముందు పాక్ ఆటగాళ్లకు కాస్త సమయం లభించడంతో కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్‌కు వెళ్లారు. ఈ సమయంలో సర్ఫరాజ్‌ను ఓ అభిమాని సెల్ఫీ అడిగాడు. దీనికి సర్ఫరాజ్‌ సైతం అంగీకరించాడు. అదే సమయంలో సర్ఫరాజ్ కొడుకు ఏడుస్తుండటంతో పక్కకు వెళ్లిపోయాడు.

ఎందుకిలా పందిలా బలిసావు

దీంతో ఆ అభిమాని "సర్ఫరాజ్‌ బాయ్‌.. ఎందుకిలా పందిలా బలిసావు. కొంచెం డైట్‌ చేయవచ్చు కదా" అంటూ ఘోరంగా అవమానపరిచాడు. సర్ఫరాజ్‌ ఏ మాత్రం ఆగ్రహానికి గురవ్వకుండా ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సర్ఫరాజ్ పట్ల ఆ అభిమాని చర్యను నెటిజన్లు తప్పుబట్టారు.

నీలాంటి వెదవల జోలికి పోవడం కన్నా

"నీలాంటి వెదవల జోలికి పోవడం కన్నా ప్రశాంతంగా ఉండటమే మంచిదని వాళ్లమ్మ సర్ఫరాజ్‌కు నేర్పించింది" అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా... "నీవు చేసే 9-5 ఉద్యోగంలో ఏదో తప్పిదం చేస్తే.. అప్పుడు జనాలంతా రోడ్లపై నిన్ను ఇలానే అవమానపరిస్తే తట్టుకుంటావా?" అని మరొక నెటిజన్ ప్రశ్నించాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, June 22, 2019, 10:22 [IST]
Other articles published on Jun 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X