న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షకీబుల్‌ అరుదైన రికార్డు.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఏకైక ప్లేయ‌ర్‌గా!!

Shakib Al Hasan becomes first cricketer to score 6000 runs and take 300 wickets in a single country

ఢాకా: బంగ్లాదేశ్‌ స్టార్ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఓ అరుదైన రికార్డు సాధించాడు. సోమ‌వారం వెస్టిండీస్‌తో జ‌రిగిన వన్డే మ్యాచ్‌లో షకీబుల్‌‌.. గ‌తంలో ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఒకే దేశంలో 6 వేల‌కుపైగా ప‌రుగులు, 300కుపైగా వికెట్లు తీసిన ఏకైక ప్లేయ‌ర్‌గా 33 ఏళ్ల షకీబుల్‌ నిలిచాడు. బంగ్లాదేశ్‌లో టెస్టులు, వన్డేలు, టీ20లు క‌లిపి ఈ రికార్డు నెలకొల్పాడు.

బుకీలు త‌న‌ను క‌లిసినా ఆ విష‌యాన్ని చెప్ప‌ని కార‌ణంగా ఏడాది నిషేధం ఎదుర్కొన్న షకీబుల్‌ హసన్‌‌.. వెస్టిండీస్ సిరీస్‌తోనే మ‌ళ్లీ అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. విండీస్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో హాఫ్ సెంచరీ (51) చేశాడు. దీంతో బంగ్లాదేశ్‌లో 6 వేల‌కుపైగా ప‌రుగులు చేశాడు. గ‌తంలో భారత్ ఆల్‌రౌండ‌ర్ క‌పిల్ దేవ్ ఇండియాలో 4 వేల‌కుపైగా ప‌రుగులు, 300కుపైగా వికెట్లు తీశాడు. 2006లో బంగ్లాదేశ్ త‌ర‌ఫున అరంగేట్రం చేసిన షకీబుల్‌‌.. 2019 ప్రపంచకప్‌‌లో తన జట్టు సెమీస్ చేర‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు.

మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 రన్స్ చేసింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (64; 80 బంతుల్లో, 3x4, 1x6), షకీబుల్‌ హసన్‌ (51), రహీమ్ (64), మహ్మదుల్లా (64) హాఫ్ సెంచరీలు బాదారు. విండీస్ బౌలర్లు జోసెఫ్, రిఫర్ రెండు వికెట్లు పడగొట్టాడు. లక్ష ఛేదనలో విండీస్ 177 పరుగులకే ఆలౌట్ అయింది. పావెల్ (47) టాప్ స్కోరర్. బంగ్లా బౌలర్ సైఫుద్దీన్ 3 వికెట్లు తీశాడు.

షకీబుల్‌ అక్టోబర్ 2019 నుంచి క్రికెట్ ఆడలేదు. 2018 జనవరిలో బంగ్లాదేశ్‌, శ్రీలంక, జింబాబ్వే ముక్కోణపు టోర్నీ సందర్భంగా షకీబుల్‌ను బుకీలు సంప్రదించారు. ఈ విషయం ఐసీసీకి వెల్లడించడంలో విఫలమైనందుకు ఆర్టికల్‌ 2.4.4 ప్రకారం రెండు అభియోగాలు నమోదయ్యాయి. ఇక 2018 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మ్యాచ్‌ సందర్భంగా కూడా బుకీలు సంప్రదించారు. ఆ విషయాన్ని కూడా వెల్లడించకపోవడంతో మరో అభియోగం నమోదైంది. ఐసీసీ అవినీతి నిరోధ విభాగం జరిపిన విచారణలో షకీబుల్‌ తన తప్పులను ఒప్పుకున్నాడు. తప్పు అంగీకరించడంతో ఐసీసీ శిక్ష విధించింది. షకీబుల్‌‌ తన తప్పు అంగీకరించడంతో ఏడాది మినహాయింపు లభించింది. గత అక్టోబర్ 29తో అతని సస్పెన్షన్ ముగిసింది.

Sri Lanka vs England: 12 మందితో ఫీల్డింగ్ చేస్తారా?.. శ్రీలంకపై ఐసీసీ సిరీస్!!Sri Lanka vs England: 12 మందితో ఫీల్డింగ్ చేస్తారా?.. శ్రీలంకపై ఐసీసీ సిరీస్!!

Story first published: Monday, January 25, 2021, 21:17 [IST]
Other articles published on Jan 25, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X