న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పాక్ జట్టులో దూకుడు తగ్గడమే వైఫల్యానికి కారణం'

Shahid Afridi takes to Twitter, speaks about Pakistan’s exit from Asia Cup

న్యూ ఢిల్లీ: ప్రస్తుతం జరుగుతోన్న ఆసియా కప్ టోర్నీ నుంచి పాకిస్తాన్ నిష్క్రమణకు గురైంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌ జట్టుకు దూకుడు తగ్గిపోవడం వల్లనే ఆసియాకప్‌ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని ఆ జట్టు మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది అన్నాడు. టోర్నీ ఆరంభానికి ముందు భారీ అంచనాలతో ఉన్న పాక్ జట్టు.. క్రికెటర్లు వ్యక్తిగతంగా సైతం ప్రగల్భాలు పలికారు. దాయాది జట్టు భారత్ పని పడతాం. వదిలేది లేదంటూ గొప్పలు పోయారు.

'పాకిస్థాన్‌ ఇంత చెత్తగా ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌లో ఓడడం ఇంకా నిరాశపరిచింది. ఫైనల్‌ చేరినందుకు బంగ్లాకు అభినందనలు. దూకుడుగా ఆడకపోవడం వల్లే పాకిస్థాన్‌ ఓడిపోయింది. గత కొన్ని టోర్నీల్లో పాక్‌ యువ జట్టు బాగానే ఆడింది. దీంతో జట్టుపై అంచనాలు పెరిగాయి. కానీ ఆసియాకప్‌లో ఓటమి స్వయంకృపరాథమే. ప్రాక్టీస్‌తోనే తప్పులు దిద్దుకుని మళ్లీ బలంగా పుంజుకునే అవకాశం ఉంటుంది' అని అఫ్రిది అన్నాడు.

బంగ్లాదేశ్‌తో సూపర్‌-4 మ్యాచ్‌లో పాక్‌ 37 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. చిరకాల ప్రత్యర్థి భారత్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పాక్‌ చిత్తుగా ఓడిపోయింది. చివరి సూపర్‌-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ అద్భుతంగా ఆడింది. పాకిస్థాన్‌ను 37 పరుగుల తేడాతో ఓడించింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బంగ్లా నిర్దేశించిన 240 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్‌ తడబడింది. 18 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. ఈ క్రమంలో సీనియర్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ (30) 51 బంతుల్లో 2ఫోర్లతో నిలిచాడు. ఆచితూచి ఆడాడు.

ఆసియా క్రికెట్లో ఆధిపత్యమెవరిదో తేలే సమయం ఆసన్నమైంది. రికార్డు స్థాయిలో ఏడో టైటిల్‌పై కన్నేసిన టీమ్‌ ఇండియా తిరుగులేని ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా.. తొలి కలను నేర్చుకోవాలని బంగ్లాదేశ్‌ ఆరాటపడుతోంది. నేడే ఆసియాకప్‌ ఫైనల్‌. రికార్డు, ఫామ్‌.. భారత్‌ను టైటిల్‌ వేటలో ముందు నిలుపుతున్నాయి. టోర్నీలో పేలవంగానే ఆడినా ఆఖరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలిచి బంగ్లా ఫైనల్‌కు చేరగలిగింది.

Story first published: Friday, September 28, 2018, 12:54 [IST]
Other articles published on Sep 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X