న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

14 బంతుల్లో హాఫ్ సెంచరీ, 6, 6, 6, 6 బాదిన అఫ్రీది

 Shahid Afridi slams 14-ball fifty, single-handedly demolishes Northern Warriors bowling attack

న్యూఢిల్లీ: టీ10లీగ్‌లో సీనియర్ క్రికెటర్లు బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. బాల్ ఎలాంటిదైనా బాదుడే పనిగా బౌండరీలను టార్గెట్ చేస్తున్నారు. షార్జా వేదికగా తాజాగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిది అఫ్రిది ఇదే కోవలో రెచ్చిపోయాడు. 17 బంతుల్లో 3ఫోర్లు, 7సిక్సులతో (59) మెరుపు హాఫ్ సెంచరీ బాదడంతో అతను ప్రాతినిథ్యం వహించిన పాక్‌టూన్స్‌ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.

రొమన్ పొవెల్ 35 బంతుల్లో (80)

రొమన్ పొవెల్ 35 బంతుల్లో (80)

అనంతరం లక్ష్య ఛేదనకి నార్తర్న్ వారియర్స్ జట్టు కూడా ధీటుగా బదులిచ్చింది. రొమన్ పొవెల్ 35 బంతుల్లో (80) నాటౌట్ 4ఫోర్లు, 9సిక్సులతో దూకుడుగా ఆడటంతో ఆ జట్టు 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేయగలిగింది. ఛేదనలో ఆండ్రీ రసెల్ (0), డ్వేన్ స్మిత్ (3) నిరాశపరచడం ఆ జట్టుని దెబ్బతీసింది. దీంతో.. 13 పరుగుల తేడాతో గెలుపొందిన అఫ్రీది జట్టు పాక్‌టూన్స్‌ టోర్నీ ఫైనల్‌లోకి చేరింది.

అఫ్రిది బాదుడే హైలైట్‌గా

హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్రిది బాదుడే హైలైట్‌గా నిలిచింది. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మైలురాయిని అందుకున్న అఫ్రిది.. మ్యాచ్‌లో తొలి బంతినే సిక్స్‌గా మలిచి బౌలర్లకు బెదురు పుట్టించాడు. ఆ తర్వాత ఓవర్‌లో రసెల్‌ బౌలింగ్‌లో మరో సిక్స్‌ బాదిన ఈ పాకిస్థాన్ హిట్టర్.. ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన రియాజ్ బౌలింగ్‌లో దూకుడు మీద ఆడాడు.

10 బంతుల్లో 38 పరుగులతో

వరుసగా 6, 6, 6, 6 బాదేశాడు. దీంతో.. 10 బంతుల్లో 38 పరుగులతో నిలిచి.. 9వ ఓవర్‌‌లో ఒక సింగిల్‌తో పాటు వరుసగా 3 బంతుల్ని 4, 4, 4 బాదేసి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో హిట్టర్లు పరుగుల పండగ చేసుకోగా.. బౌలర్లు చేతులెత్తేశారు.

Story first published: Sunday, December 2, 2018, 15:21 [IST]
Other articles published on Dec 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X