న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్తాన్ ఆటగాళ్లు ఐపీఎల్‌ను మిస్సవుతున్నారు.. మేం చాలా నష్టపోతున్నాం: అఫ్రిది

Shahid Afridi says it’s sad that Pakistani players are missing out on IPL

కరాచీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీలో తమ దేశ ఆటగాళ్లకు చోటు లేకపోవడంపై పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఐపీఎల్ లాంటి పెద్ద బ్రాండ్ లీగ్‌లో తమ ఆటగాళ్లు ఆడకపోవడం వల్ల చాలా నష్టపోతున్నామని, పాక్ ఆటగాళ్లు ఐపీఎల్‌ను బాగా మిస్సవుతున్నారు అని అఫ్రిది పేర్కొన్నాడు. కరోనా మహమ్మారి కారణంగా మార్చిలో జరగాల్సిన ఐపీఎల్.. యూఏఈకి తరలివెళ్లింది. ఈ నెల 19న ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌తో ప్రారంభమైన టోర్నీ రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది.

మేం చాలా నష్టపోతున్నాం:

మేం చాలా నష్టపోతున్నాం:

తాజాగా పాకిస్థాన్‌ మీడియాతో షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ.... 'భారత్ నిర్వహించే ఐపీఎల్ టీ20 టోర్నీకి ఎంతో బ్రాండ్ ఉంది. అభిమానులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. బాబర్‌ అజామ్, షాహిన్ ఆఫ్రిది ఇతర పాక్‌ క్రికెటర్లు ఐపీఎల్ లీగ్‌లో ఆడితే ఒత్తిడిలో రాణించడానికి అలవాటు పడతారు. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుత విధానాల వల్ల అతి పెద్ద క్రికెట్ వేదికలో మా ఆటగాళ్లు చోటు కోల్పోతున్నారు. మేం చాలా నష్టపోతున్నాం' అని పేర్కొన్నాడు. భారత్, పాకిస్థాన్‌లలో క్రికెట్‌ను ఒక మతంలా భావిస్తారని, ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడంలో క్రికెట్ కీలక పాత్ర పోషిస్తుందని అఫ్రిది ఆశాభావం వ్యక్తం చేశాడు.

 మా ఆటగాళ్లకు మంచి డిమాండ్‌ ఉంది:

మా ఆటగాళ్లకు మంచి డిమాండ్‌ ఉంది:

'ప్రపంచ వ్యాప్తంగా ఇతర లీగ్‌లలో మా ఆటగాళ్లకు మంచి డిమాండ్‌ ఉంది. అంతేకాక మా దేశంలోనే టాప్‌ (పాకిస్తాన్ సూపర్ లీగ్) లీగ్‌ ఉంది. ప్రతిభను పెంచుకోవడానికి, ప్రదర్శించడానికి, అగ్రశ్రేణి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌లో అనుభవాలు పంచుకోవడానికి పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ వేదికగా ఉంది' అని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తెలిపాడు. ఐపీఎల్ తొలి సీజన్‌లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ సారథ్యంలోని డెక్కన్ చార్జర్స్ తరపున అఫ్రిది ఆడాడు. 9 వికెట్లు పడగొట్టి 81 పరుగులు చేశాడు.

 భారత్‌లో క్రికెట్‌ ఆడటాన్ని ఆస్వాదించా:

భారత్‌లో క్రికెట్‌ ఆడటాన్ని ఆస్వాదించా:

తన కెరీర్‌లో భారత్‌ అభిమానుల నుంచి ఎంతో ఆదరణ పొందానని షాహిద్ అఫ్రిది పేర్కొన్నాడు. 'భారత్‌లో క్రికెట్‌ ఆడటాన్ని ఎంతో ఆస్వాదించా. వాళ్లు చూపించే ప్రేమ, గౌరవాన్ని ఎప్పుడూ అభినందిస్తుంటా. సామాజిక వేదికల్లో భారత్ నుంచి కూడా సందేశాలు వస్తుంటాయి. వాటిలో ఎంతో మందికి బదులిచ్చాను' అని అఫ్రిది చెప్పుకొచ్చాడు. 2008 సీజన్‌ తర్వాత నుంచి పాక్‌ క్రికెటర్లు భారత్ లీగ్‌లో ఆడని విషయం తెలిసిందే. ప్రారంభ టోర్నీలో షోయబ్ అక్తర్, ఉమర్ గుల్ వంటి పాక్ ఆటగాళ్లు ఆడినప్పటికీ.. 2009 నుంచి భారత-పాక్ మధ్య ఉన్న రాజకీయ కారణాలు, ఉద్రిక్తతల కారణంగా పాక్ ఆటగాళ్లకు చోటు లేకుండా పోయింది.

RR vs KXIP: హమ్మయ్యా.. ఒక బంతికి సిక్స్ కొట్టనందుకు ధన్యవాదాలు తెవాటియా: యువరాజ్

Story first published: Monday, September 28, 2020, 9:53 [IST]
Other articles published on Sep 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X