న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కశ్మీర్‌ను ఒక దేశంగా విడిచిపెట్టేయండి: అఫ్రీది

Shahid Afridi’s lesson to PM Imran Khan: Pakistan doesnt need Kashmir; it can’t even handle its 4 provinces

ఇస్లామాబాద్: క్రికెట్ నుంచి రిటైర్ అయినా తాను చేసిన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే షాహిది అఫ్రీది మరో సారి వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. తమ దేశం ఆశపడటం ఇక చాలించాలనే అర్థం వచ్చేలా మాట్లాడాడు. ప్రస్తుతమున్న నాలుగు ప్రావిన్స్‌లనే సరిగా చూసుకోలేకపోతున్నారు.. ఇక పాకిస్థాన్‌కు కశ్మీర్ ఎందుకంటూ ప్రశ్నలు సంధించాడు. కశ్మీర్‌ను వదిలేయండి.. ఉన్న ప్రాంతాన్ని సరిగ్గా చూసుకోండి అని పాక్ ప్రభుత్వాన్ని అఫ్రిది డిమాండ్ చేశాడు.

బ్రిటిష్ పార్లమెంట్‌లో విద్యార్థులతో

బ్రిటిష్ పార్లమెంట్‌లో విద్యార్థులతో

ఓ క్రికెటర్ అధ్యక్షతన నడుస్తోన్న కొత్త ప్రభుత్వానికి అఫ్రీది సూచనలిచ్చే విధంగా మాట్లాడాడు. బ్రిటిష్ పార్లమెంట్‌లో విద్యార్థులతో మాట్లాడుతున్న సందర్భంగా అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీసే పరిస్థితి కనిపిస్తోంది.

చావుల్లేకుండా ఎక్కడ చూసినా మానవత్వమే

చావుల్లేకుండా ఎక్కడ చూసినా మానవత్వమే

అక్కడి ప్రజలు చావకూడదు. ఎక్కడ చూసినా మానవత్వమే కనిపించాలి. అక్కడ ప్రజలు చచ్చిపోతున్నారు. అదెంతో ఘోరమైన పరిస్థితి. ఇది చాలా బాధాకరం. ఏ తెగ నుంచైనా.. ఏ మతమైనా ప్రాణాలు కోల్పోవడమనేది చిన్న విషయం కాదు. గతంలోనూ కశ్మీర్ అంశంపై స్పందిస్తూ.. అక్కడ భారత్ అమలు చేస్తున్న విధానాన్ని అతడు విమర్శించాడు. అయితే అప్పట్లో భారత క్రికెటర్ల నుంచి కూడా అఫ్రిది తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు.

 సురక్షితంగా ఉంచడం ప్రభుత్వాలకు చేతకాకనే

సురక్షితంగా ఉంచడం ప్రభుత్వాలకు చేతకాకనే

ఉగ్రవాదుల నుంచి దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి కూడా తమ ప్రభుత్వాలకు చేత కాలేదని అతను విమర్శించాడు. ఇక కశ్మీర్‌ను ఇండియాకు కూడా ఇవ్వొద్దని, లోయలో ప్రజలు చనిపోవడం తనను ఎంతగానో బాధిస్తోందని అఫ్రిది అన్నాడు. పాకిస్థాన్‌కు కశ్మీర్ అవసరం లేదు. అలాగని ఇండియాకు కూడా దానిని ఇవ్వొద్దు. కశ్మీర్ ప్రత్యేక దేశం కావాలి.

ఆన్ లైన్ వేదికగా విమర్శలు

ఆన్ లైన్ వేదికగా విమర్శలు

అఫ్రీది చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ.. పలువురు నెటిజన్లు అతనిపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇది ముమ్మాటికి వృథా మాటలే. ఒకవేళ శాంతి కావాలనుకునేవాళ్లే అయితే వేరేలా ఉండేది. ఇప్పటికీ చాలాసార్లు ఉగ్రదాడులకు పాల్పడిన ఘటనలో పాక్ పాత్ర చాలా వరకు కనిపిస్తోంది. ముందు ఆ సంగతి చూసుకోమంటూ ఘాటుగా సమాధానాలిస్తున్నారు.

Story first published: Wednesday, November 14, 2018, 16:55 [IST]
Other articles published on Nov 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X