న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అఫ్రీది పేరు పెట్టింది రవిశాస్త్రియేనట..!

Shahid Afridi got ‘Boom Boom’ nickname from this Indian cricketer

సౌతంప్టన్: క్రికెట్ ప్రపంచాన్ని చిరకాలం గుర్తుండిపోయే పేరు షాహిద్ అఫ్రీది. క్రికెట్‌లో సుదీర్ఘకాలం విధ్వంసక ఇన్నింగ్స్‌లకు మారుపేరుగా నిలిచిన ఈ పాకిస్థాన్ హిట్టర్.. తనకి ఆ 'బూమ్‌ బూమ్ అఫ్రిది' అనే ఎవరు పెట్టారో ఇన్నాళ్లకి వెల్లడించాడు. క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అనతికాలంలోనే ఈ పాక్ మాజీ కెప్టెన్ వన్డేల్లో కేవలం 37 బంతుల్లో శతకం సాధించి ఔరా అనిపించాడు.

సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగిన సరదా ప్రశ్నలకి సమాధానం చెప్పి ఆ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఓ అభిమాని 'మీకు బూమ్ బూమ్ అని ఎవరు ముద్దుపేరు పెట్టారు..?' అని ప్రశ్నించగా.. 'రవిశాస్త్రి' అని ఈ హిట్టర్ సమాధానమిచ్చాడు. ప్రస్తుతం భారత జట్టుకి హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రవిశాస్త్రి.. మ్యాచ్‌ కామెంటేటర్‌గా పనిచేస్తున్న సమయంలో తొలుత అలా పిలిచినట్లు తెలుస్తోంది.

ఫార్మాట్ ఏదైనా.. షాహిద్ అఫ్రిది క్రీజులో ఉంటే స్కోరు బోర్డు పరుగులెత్తుతుంది అనేంతలా అభిమానులు దృష్టి‌లో బలమైన ముద్ర వేశాడు. కానీ.. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడం కెరీర్ చరమాంకంలో అతని బలహీనతగా మారింది. అయినప్పటికీ.. అతను బాదిన వేగవంతమైన సెంచరీ రికార్డు‌ 17 ఏళ్ల పాటు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. 2017 ఫిబ్రవరిలో అంతర్జాతీయ క్రికెట్‌కి అఫ్రిది వీడ్కోలు పలికాడు.

కెరీర్‌లో మొత్తం 398 వన్డేలాడి 8,064 పరుగులు చేసిన అఫ్రిది.. ఆరు సెంచరీలు, 39 అర్ధశతకాలు బాదాడు. 99 టీ20ల్లో 1,416 పరుగులు చేసి.. నాలుగు అర్ధశతకాలు, 27 టెస్టుల్లో 1,716 పరుగులు చేసి ఐదు శతకాలు, 8 అర్ధశతకాలు సాధించాడు.

Story first published: Monday, August 27, 2018, 20:07 [IST]
Other articles published on Aug 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X