నో సెలబ్రేషన్: వికెట్ తీశాడు.. వూరకుండిపోయాడు

Posted By:
Shaheen Afridi wins hearts for showing respect to Shahid Afridi

హైదరాబాద్: వికెట్ తీయగానే బౌలర్లు విజయోత్సాహంతో మైదానంలో కేకలు పెడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. కానీ, అలా ఆర్భాటాలేమీ చేయకుండా ఊరకుండిపోయాడు పాకిస్థాన్ బౌలర్. ఈ ఘటన పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో చోటు చేసుకుంది.

పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో భాగంగా కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లాహోర్ యువ బౌలర్ షహీన్ అఫ్రీదీ, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షహీద్ అఫ్రిదీని ఆరు పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ చేశాడు. వెంటనే ఆనందంతో పరుగు తీసిన 17 ఏళ్ల బౌలర్ వెంటనే తన తీరు మార్చుకొని సెలబ్రేషన్ ఆపేశాడు.

తన సీనియరైన అఫ్రిదీకి గౌరవంగానే షహీన్ అలా చేసినట్లు తెలుస్తోంది. సీనియర్ ఆటగాళ్లకు అంత గౌరవమిచ్చిన షహీన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లాహోర్ క్వాలండర్స్ జట్టు కరాచీ కింగ్స్ జట్టు తలపడుతుండగా 20 ఓవర్లో షహీన్ అఫ్రీది చేతిలో షాహిద్ అఫ్రీది అవుటయ్యాడు.

Story first published: Tuesday, March 13, 2018, 17:40 [IST]
Other articles published on Mar 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి