న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

10 పరుగులకే 8 వికెట్లు: 20 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన స్పిన్నర్

Shahbaz Nadeem breaks two-decade-old List A bowling world record with sensational spell

హైదరాబాద్: లిస్ట్ ఏ క్రికెట్‌లో జార్ఖండ్‌కు చెందిన షెహబాజ్ నదీమ్ 20 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టాడు. విజయ్ హాజార్ ట్రోఫీలో భాగంగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నదీమ్ అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్స్ (8/10)తో ఈ రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

భువీ స్వింగ్, కేదార్ జాదవ్ మ్యాజిక్: పాక్‌పై భారత్ విజయం వెనుకభువీ స్వింగ్, కేదార్ జాదవ్ మ్యాజిక్: పాక్‌పై భారత్ విజయం వెనుక

లెప్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన నదీమ్ గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తూ జాతీయ జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా తన బౌలింగ్‌తో రాజస్థాన్‌ బ్యాటింగ్ ఆర్డర్‌ను అతి తక్కువ స్కోరుకే కుప్పకూల్చాడు.

ఈ మ్యాచ్‌లో నదీమ్ బౌలింగ్ విజృంభణకు రాజస్థాన్ 28.3 ఓవర్లలో 73 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో నదీమ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ 10-4-10-8 బౌలింగ్ ఫిగర్స్‌ను నమోదు చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో గత అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్స్ 8/15గా ఉంది.

బ్యాటింగ్ బాగానే చేశా, పరుగులే చేయలేకపోయా: తన ఫామ్‌పై ధావన్బ్యాటింగ్ బాగానే చేశా, పరుగులే చేయలేకపోయా: తన ఫామ్‌పై ధావన్

దీనిని 1997-98లో ఢిల్లీకి చెందిన లెప్ట్ ఆర్మ్ స్పిన్నర్ రాహుల్ సంఘ్వి హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నమోదు చేశాడు. ఆ రికార్డుని ఇప్పుడు జార్ఖండ్‌కు చెందిన షెహజాబ్ నదీమ్ బద్దలు కొట్టాడు. రాహుల్ సంఘ్వి భారత్ తరుపున 2001లో ఆస్ట్రేలియాపై ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడాడు.

ఇప్పటివరకు 99 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడిన షెహజాబ్ నదీమ్ 29.74 యావరేజితో 375 వికెట్లు తీశాడు. ఇక, లిస్ట్ ఏ క్రికెట్‌ వన్డేల్లో 87 మ్యాచ్‌లాడి 124 వికెట్లు తీయగా... 109 టీ20ల్లో 89 వికెట్లు తీశాడు. జార్ఖండ్ తరుపున షెహజాబ్ మూడు ఫార్మాట్లలో కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు.

ఇటీవలే స్వదేశంలో ఆస్ట్రేలియా ఏతో జరిగిన ఇండియా ఏ జట్టులో కూడా నదీమ్ జట్టు సభ్యుడిగా ఉన్నాడు.

Story first published: Thursday, September 20, 2018, 15:23 [IST]
Other articles published on Sep 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X