న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

7 హాఫ్ సెంచరీలు, ఒక్క విజయం లేదు: స్టోయినిస్ ఖాతాలో ఓ చెత్త రికార్డు

Seven 50+ scores, no wins: Marcus Stoinis’ unfortunate record

హైదరాబాద్: నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో వన్డేలో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో 251 పరుగుల విజయ లక్ష్యాన్ని కాపాడుకుంది. ఫలితంగా ఐదు వన్డేల సిరిస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంలో నిలిచింది.

<strong>భారత ఖాతాలో 500 వన్డే విజయం: ఎవరిపై ఎన్ని విజయాలో తెలుసా?</strong>భారత ఖాతాలో 500 వన్డే విజయం: ఎవరిపై ఎన్ని విజయాలో తెలుసా?

1995 తర్వాత ఆస్ట్రేలియాపై 251 పరుగుల లక్ష్యాన్ని భారత్ కాపాడుకోవడం ఇదే తొలిసారి. అంతే కాదు కోహ్లీ నాయకత్వంలో టీమిండియా కాపాడుకున్న అతి తక్కువ లక్ష్యమిదే. ఈ విజయం వన్డేల్లో టీమిండియాకు 500వ విజయం. ఫలితంగా వన్డేల్లో 500 విజయాలను నమోదు చేసిన రెండో జట్టుగా భారత జట్టు అరుదైన ఘనత సాధించింది.

558 విజయాలతో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా

558 విజయాలతో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా

ఈ జాబితాలో 558 విజయాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. 479 విజయాలతో పాకిస్థాన్ మూడో స్థానంలో కొనసాగుతోంది. 1975 జూన్ 11న వెంకటరాఘవన్ కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు తొలి వన్డే విజయాన్ని నమోదు చేసింది. 1975 వరల్డ్ కప్‌‌లో ఆడిన భారత్ పది వికెట్ల తేడాతో ఈస్ట్ ఆఫ్రికాపై భారత్ విజయం సాధించింది.

49.3 ఓవర్లలో 242 పరుగులకే ఆసీస్ ఆలౌట్

49.3 ఓవర్లలో 242 పరుగులకే ఆసీస్ ఆలౌట్

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (116) సెంచరీకి తోడు విజయ్‌ శంకర్‌(46) ఆకట్టుకోవడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన 48.2 ఓవర్లలోనే 250 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం 251 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 242 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా జట్టులో స్టోయినిస్‌(52), పీటర్‌ హ్యాండ్స్‌ కోంబ్‌(48), ఖవాజా(38), అరోన్‌ ఫించ్‌(37)లు మాత్రమే ఫర్వాలేదనిపించారు.

ఆస్ట్రేలియా ఓటిమికి కారణమైన సెంటిమెంట్

ఆస్ట్రేలియా ఓటిమికి కారణమైన సెంటిమెంట్

అయితే, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటిమికి ఓ సెంటిమెంట్ కారణమైంది. వన్డేల్లో మార్కస్ స్టోయినిస్ 50+ స్కోరు చేసిన ప్రతిసారి ఆస్ట్రేలియా ఓటమి చవి చూసింది. స్టోయినిస్ ఇప్పటివరకు 7 హాఫ్ సెంచరీలు సాధించినా... ఒక్కసారి కూడా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. 2017లో న్యూజిలాండ్‌పై స్టోయినిస్ 146 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఏడు హాఫ్ సెంచరీలు... ఒక్క విజయం లేదు

ఏడు హాఫ్ సెంచరీలు... ఒక్క విజయం లేదు

ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోయింది. అదే ఏడాది భారత్‌పై 62 పరుగులతో నాటౌట్‌గా నిలవగా ఆ మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. గత ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేల్లో 60, 56, 87 చొప్పున పరుగులు చేశాడు. అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆస్ట్రేలియా ఓడిపోయింది. గతేడాది దక్షిణాఫ్రికాపై స్టోయినిస్ 63 పరుగులు చేసినప్పుడు కూడా ఆస్ట్రేలియా ఓటమిపాలైంది.

ఎల్బీగా వెనుదిరిగిన మార్కస్ స్టోయినిస్

ఎల్బీగా వెనుదిరిగిన మార్కస్ స్టోయినిస్

ఇప్పుడు మంగళవారం నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన రెండో టీ20లోనూ 52 పరుగులతో చివరి వరకూ ఆస్ట్రేలియా గెలుపు కోసం పోరాడాడు. చివరి ఓవర్‌లో ఆస్ట్రేలియా విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. విజయ్ శంకర్ వేసిన తొలి బంతికే స్టోయినిస్‌ (52) ఎల్బీగా వెనుదిరిగడంతో మ్యాచ్ ఆసీస్ చేజారింది. ఆ తర్వాత ఆడమ్‌ జంపా (2) కూడా ఔట్ కావడంతో ఆస్ట్రేలియా జట్టు 242 పరుగులకు ఆలౌటైంది.

Story first published: Wednesday, March 6, 2019, 13:39 [IST]
Other articles published on Mar 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X