న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెర్త్ టెస్టు: ఇంగ్లాండ్ 403 ఆలౌట్, సెంచరీ ముంగిట స్టీవ్ స్మిత్

By Nageshwara Rao
Sensational Smith leads Australia fightback

హైదరాబాద్: యాషెస్ సిరిస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య పెర్త్‌లోని వాకా స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 62 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది.

ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ స్టీవ్ స్మిత్ (92), షాన్ మార్ష్ (7) పరుగులతో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఇంకా 200 పరుగుల వెనుకంజలో ఉంది. ఓవర్ నైట్ స్కోరు 305/4 పరుగులతో శుక్రవారం ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ రెండో రోజు దూకుడుగా ఆడారు.

ఈ క్రమంలో బెయిర్ స్టో (119, 215 బంతుల్లో 18 ఫోర్లు) సెంచరీని నమోదు చేశాడు. అంతకముందే తొలి రోజు సెంచరీ చేసిన డేవిడ్‌ మలన్‌ (140) పరుగుల వద్ద నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మెయిన్ అలీ (0), క్రిస్ వోక్స్ (8), ఓవర్టన్ (2), స్టువర్ట్ బ్రాడ్ (12) పరుగులు చేశారు.

దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 403 పరుగులు చేసిన ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4, జోష్ హాజెల్ ఉడ్ 3, కుమ్మిన్స్ 2 వికెట్లు తీసుకోగా నాథన్ లియాన్ ఒక వికెట్ తీసుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు చక్కటి శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు.

జట్టు స్కోరు 44 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్ (22) పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఓపెనర్ బ్రాన్ క్రాఫ్ట్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. ఈ క్రమంలో బ్రాన్ క్రాఫ్ట్ (25) పరుగుల వద్ద ఓవర్టన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

దీంతో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో కలిసి ఉస్మాన్ ఖవాజా నెమ్మదిగా ఆడుతూ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 123 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో ఉస్మాన్ ఖవాజా తన కెరీర్‌లో 9వ హాఫ్ సెంచరీని సాధించాడు.

హాఫ్ సెంచరీ అనంతరం ఉస్మాన్ ఖవాజా క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మరోవైపు స్టీవ్ స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ సెంచరీకి చేరువయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 92 పరుగులతో క్రీజులో ఉన్నాడు. పెర్త్ టెస్టులో కూడా సెంచరీ సాధిస్తే టెస్టుల్లో స్మిత్‌కు అది 22వ సెంచరీ అవుతుంది.

అంతేకాదు ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న యాషెస్ టెస్టు సిరిస్‌లో ఇప్పటికే ఒక సెంచరీని నమోదు చేశాడు. ఇది రెండో సెంచరీ అవుతుంది. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో ఇప్పటికే ఇంగ్లాండ్ 2-0తో వెనుకబడి ఉన్న సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 15, 2017, 17:51 [IST]
Other articles published on Dec 15, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X