న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కాంట్రాక్ట్‌లు ప్రకటించే ముందు ధోనికి చెప్పాం: బీసీసీఐ అధికారి

Senior BCCI official had intimated Dhoni about the contracts list

న్యూఢిల్లీ: బీసీసీఐ కాంట్రాక్టుల వ్యవహారం ఇండియా క్రికెట్‌లో పెద్ద దుమారాన్ని రేపింది. సీనియర్ క్రికెటర్, వరల్డ్‌కప్స్ విన్నింగ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి కాంట్రాక్టు దక్కపోవడంపై అతని అభిమానులు బీసీసీఐపై నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు మాజీ క్రికెటర్లేమో ధోని కెరీర్ ముగిసినట్టేనని, అతను రీఎంట్రీ ఇచ్చే అవకాశమే లేదని జోస్యం చెబుతున్నారు.

అయితే కాంట్రాక్టుల విషయాన్ని లెజండరీ క్రికెటర్‌తో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నామని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు. 'బీసీసీఐ ఆఫీస్ బేరర్లలో అత్యంత కీలకమైన ఓ వ్యక్తి ధోనితో కాంట్రాక్టుల విషయంపై చర్చించారు. సెప్టెంబర్ 2019 నుంచి ప్రస్తుత టైమ్ వరకు ఎలాంటి క్రికెట్ ఆడనందున కాంట్రాక్టు ఇవ్వడం కుదరదని ధోనికి స్పష్టంగా వివరించారు' అని ఒక బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.

'ఇండియా అవమానానికి గురైంది, కోహ్లీ 28వ ఓవర్‌లో రావడంలో అర్థం లేదు''ఇండియా అవమానానికి గురైంది, కోహ్లీ 28వ ఓవర్‌లో రావడంలో అర్థం లేదు'

గురువారం బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్టులో ధోనికి చోటుదక్కలేదు. గతేడాది ఎ గ్రేడ్‌లో ఉన్న ఈ మిస్టర్ కూల్‌కు ఈ సారి ఎలాంటి గ్రేడ్ దక్కలేదు. బీసీసీఐ కాంట్రాక్టుల ప్రకారం ఎ+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాడికి రూ. 7 కోట్లు, ఎ గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు రూ. 5 కోట్లు, బి గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు రూ.3 కోట్లు, సి గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు ఒక కోటి చొప్పున వేతనం లభిస్తుంది.

ఏ+ గ్రేడ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాలకు చోటు లభించింది. ఏ గ్రేడ్‌లో అశ్విన్, జడేజా, భువనేశ్వర్, పుజారా, రహానే, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్, రిషభ్ పంత్‌లు ఉన్నారు.

ఐపీఎల్‌లో రాణించినా.. ధోని ఇండియాకు ఆడడు : భజ్జీఐపీఎల్‌లో రాణించినా.. ధోని ఇండియాకు ఆడడు : భజ్జీ

బీ గ్రేడ్ జాబితాలో వృద్ధిమాన్ సాహా, ఉమేశ్ యాదవ్, యజువేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్‌లకు చోటు దక్కగా... సీ గ్రేడ్‌లో కేదార్ జాదవ్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్, మనీష్ పాండే, హనుమ విహారి, శార్దూల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్‌లు ఉన్నారు.

వీరిలో నవదీప్‌ సైనీ, మయాంక్‌ అగర్వాల్‌, శ్రేయస్‌ అ‍య్యర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌లు తొలిసారి బోర్డు కాంట్రాక్ట్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Story first published: Thursday, January 16, 2020, 18:21 [IST]
Other articles published on Jan 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X