న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సంజూ శాంసన్‌కు అన్యాయం?: సెలక్షన్ కమిటీని మార్చాలంటూ దాదాకు భజ్జీ ట్వీట్

Harbhajan Singh Urges BCCI President BCCI To Change Selection
Selection panel needs to be changed: Harbhajan Singh urges BCCI president Sourav Ganguly

హైదరాబాద్: వచ్చే నెలలో వెస్టిండిస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరిస్‌కు సంజూ శాంసన్ పేరుని పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీపై టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్, లోక్‌సభ ఎంపీ శశి థరూర్ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

డిసెంబర్ 6 నుంచి స్వదేశంలో వెస్టిండిస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేల సిరిస్ జరగనుంది. ఈ పరిమిత ఓవర్ల సిరిస్‌కు వికెట్ కీపర్‌గా సెలక్టర్లు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కే అకాశమిచ్చారు. గత కొన్నాళ్లుగా వికెట్ కీపర్‌‌గా రిషబ్ పంత్ విఫలమవుతున్నా మళ్లీ అతడినే ఎంపిక చేయడంపై మాజీలు సైతం మండిపడుతున్నారు.

'మ్యాచ్‌ అయిపోయాక ఇంకా జరుగుతుందనే అనుకున్నా.. క్రికెట్‌ గురించి నేర్చుకోవాలి''మ్యాచ్‌ అయిపోయాక ఇంకా జరుగుతుందనే అనుకున్నా.. క్రికెట్‌ గురించి నేర్చుకోవాలి'

ఈ నేపథ్యంలో ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీని మార్చాలంటూ భజ్జీ డిమాండ్‌ చేశాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో "భారత క్రికెట్‌ జట్టుకు ఇక బలమైన సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసే సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో గంగూలీ చొరవ తీసుకుంటాడని ఆశిస్తున్నా" అని ట్వీట్ చేశాడు.

మరోవైపు విండిస్ పర్యటనకు సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంపై లోక్‌సభ ఎంపీ శశి థరూర్‌ ట్విట్టర్‌లో తప్పుబట్టాడు. "అవకాశం ఇవ్వకుండా సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడం నన్ను తీవ్రంగా నిరాశకు గురి చేసింది. కనీసం అవకాశం కూడా ఇవ్వడం లేదు. మూడు టీ20ల సిరిస్‌లో డ్రింక్స్‌ ఇవ్వడం వరకే పరిమితం చేశారు. తుది జట్టులో అవకాశం ఇవ్వకుండా విస్మరించారు. అతడి బ్యాటింగ్‌ను పరీక్షించాలనుకుంటున్నారా లేక అతని హృదయాన్నా?" అని ట్వీట్ చేశాడు.

ఓడినవారు సాకులు చెప్తారు: పింక్ బాల్ టెస్ట్‌ ఓటమిపై బంగ్లాదేశ్ కెప్టెన్ఓడినవారు సాకులు చెప్తారు: పింక్ బాల్ టెస్ట్‌ ఓటమిపై బంగ్లాదేశ్ కెప్టెన్

శశిథరూర్ ట్వీట్‌పై స్పందించిన భజ్జీ "నేను అనుకోవడం శాంసన్‌ హృదయాన్ని టెస్టు చేయాలనే అనుకుంటున్నారు. సెలక్షన్‌ ప్యానల్‌ను మార్చాలి. పటిష్టమైన సెలక్షన్‌ కమిటీని ఏర్పాటు చేయాలి. దాదా అందుకు చర్యలు తీసుకుంటాడనే ఆశిస్తున్నా" అని ట్విట్టర్‌లో రిప్లై ఇచ్చాడు.

Story first published: Monday, November 25, 2019, 15:02 [IST]
Other articles published on Nov 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X