న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెహ్వాగ్ 'డబుల్' సునామీకి ఆరేళ్లు పూర్తి: ఐసీసీ ట్వీట్

By Nageshwara Rao
Sehwag scored the second ever ODI double century against West Indies in Indore

హైదరాబాద్: ఆరు సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అద్భుతం చేసాడు. వెస్టిండిస్ బౌలర్లపై విరుచుకుపడి ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

అంతేకాదు వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా సెహ్వాగ్ అరుదైన గుర్తింపు పొందాడు. సెహ్వాగ్‌కు ముందు సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 8, 2011లో ఇండోర్‌ వేదికగా విండిస్‌తో జరిగిన నాలుగో వన్డేలో సెహ్వాగ్‌ 149 బంతుల్లో 25 ఫోర్లు, 7 సిక్సులతో 219 పరుగులు చేశాడు.

దీంతో ఆ మ్యాచ్‌లో భారత్ 418 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసిన ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండిస్‌పై 153 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.

వన్డేల్లో భారత్‌ జట్టు నమోదు చేసిన అత్యధిక పరుగులు (418) కూడా ఈ మ్యాచ్‌లోనే నమోదయ్యాయి. ఇదిలా ఉంటే వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సెహ్వాగ్ మూడో స్ధానంలో ఉన్నారు. రోహిత్‌ శర్మ(264) అగ్రస్ధానంలో ఉండగా... న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్టిల్‌(237) రెండో స్ధానంలో ఉన్నాడు.

Story first published: Friday, December 8, 2017, 11:10 [IST]
Other articles published on Dec 8, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X