న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెన్నై vs హైదరాబాద్: స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న బ్రావో..(వీడియో)

 Seeing this fantastic catch you will also say, Dwayne Bravo is the champion

హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఎప్పుడు క్యాచ్ అందుకున్నా తన 'డీజే బ్రావో' స్టెప్ వేస్తూ ఉంటాడు. క్యాచ్ పట్టిన వెంటనే ప్రేక్షకుల వైపు తిరిగి డ్యాన్స్ చేస్తాడు. అయితే మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో బ్రేవో పట్టిన క్యాచ్ చూస్తే ఎవరికైనా అతనితో పాటు సంబరాలు చేసుకోవాలనిపిస్తుంది.

డ్వేన్ బ్రావో వేసిన 15 ఓవర్‌లో ఐదో బంతిని యూసఫ్ పఠాన్ బౌండరీకి తరలించాడు. ఇక ఆఖరి బంతిని కూడా స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. అయితే పిచ్‌కు చాలా తక్కువ ఎత్తులో వేగంగా దూసుకొచ్చిన ఆ బంతిని బ్రావో అద్భుతంగా అందుకున్నాడు. భూమికి జానెడు ఎత్తులో వచ్చిన బంతిని ఒంటిచేత్తో అందుకుని గుండ్రంగా తిరిగుతూ పిచ్‌పై పడిపోయాడు. వెంటనే పైకిలేచి 'డీజే బ్రావో' అంటూ తన మార్క్ స్టెప్‌తో సంబరాలు చేసుకున్నాడు.

అప్పటికే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సన్‌రైజర్స్‌ను యూసఫ్ పఠాన్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 29 బంతుల్లో 24 పరుగులు చేశాడు. దీనిలో మూడు ఫోర్లు కూడా ఉన్నాయి. పఠాన్ ఔట్ కావడంతో 88 పరుగులకే హైదరాబాద్ 6 కీలక వికెట్లు కోల్పోయింది. అయితే మరో కరేబియన్ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్ 29 బంతుల్లో (43) చెలరేగి ఆడటంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు చేయగలిగింది.

డుప్లెసిస్‌ అద్భుత పోరాటంతో సన్‌రైజర్స్‌ చేతుల్లో నుంచి విజయాన్ని లాగేసుకుని.. చెన్నై ఐపీఎల్‌-11 ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఐపీఎల్‌ ఫైనల్‌ చేరడం చెన్నైకి ఇది ఏడోసారి. ఓడినా.. ఫైనల్‌ చేరేందుకు సన్‌రైజర్స్‌కు మరో అవకాశముంది. ఫైనల్లో స్థానం కోసం ఆ జట్టు ఎలిమినేటర్‌లో విజేతతో క్వాలిఫయర్‌-2లో తలపడుతుంది. ఫాఫ్‌ డుప్లెసిస్‌ (67) అసాధారణంగా పోరాడిన వేళ.. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో చెన్నై 2 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై గెలిచింది. జ

Story first published: Wednesday, May 23, 2018, 8:54 [IST]
Other articles published on May 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X