న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాక్సీనా మజాకానా.. సిక్స్‌ కొడితే సీటుకే బొక్క!

Seat broken by Glenn Maxwell’s six against New Zealand

వెల్లింగ్టన్‌: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ చెలరేగాడు. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన మూడో టీ20లో ఈ ఆసీస్ ఆల్‌రౌండర్ దుమ్ములేపాడు. 31 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ కొట్టిన ఓ సిక్స్‌తో మైదానంలోని సీటుకు బొక్కపడింది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ బౌలింగ్‌ను చీల్చిచెండాడిన మ్యాక్సీ.. అతను వేసిన ఓ ఓవర్‌లో రెండు సిక్స్‌లతో సాయంతో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. అయితే ఈ రెండు సిక్స్‌ల్లో ఓ సిక్స్‌కు వెల్లింగ్టన్‌లోని వెస్ట్‌పేస్ స్టేడియం సీటుకు బొక్కపడింది. మ్యాక్సీ సెన్సేషన్ బ్యాటింగ్‌తో సీటుకు బొక్కపడటంతో ఆ సీటును చారిటీ కోసం న్యూజిలాండ్ వేలం వేయనుంది. ఆ సీటుపై మ్యాక్సీతో సంతకం కూడా చేయించింది. దీనికి సంబంధించిన ఫొటోలను క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్ వేదికగా పంచుకోవడంతో వైరల్‌గా మారాయి.

మ్యాక్సీ విధ్వంసానికి అండగా ఇతర ఆటగాళ్లు కూడా రాణించడంతో ఈ మ్యాచ్‌లో ఆసీస్ 64 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. మ్యాక్సీతో పాటు కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌(69), జోష్ ఫిలిప్‌(43) రాణించారు. కివీస్‌ బౌలర్లలో టీమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్‌ చెరో వికెట్‌ తీయగా, ఇష్ సోధి రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన కివీస్‌ 17.1 ఓవర్లలో 144 పరుగులకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టకుంది. ఆష్టన్‌ అగర్‌ 6 వికెట్లతో చెలరేగగా, మెరెడిత్‌ రెండు, ఆడం జంపా, కేన్‌ రిచర్డ్‌సన్‌ చెరో వికెట్‌ తీశారు. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఆసీస్ ఖాతా తెరించింది. కివీస్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది.

Story first published: Wednesday, March 3, 2021, 19:31 [IST]
Other articles published on Mar 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X