
హోర్నీయా చికిత్సతో..
ఇటీవలే హెర్నీయా శస్త్రచికిత్స చేయించుకున్న కేఎల్ రాహుల్ తర్వాత కొవిడ్ బారిన పడి విషయం తెలిసిందే. ఆసియా కప్‌నకు కూడా అందుబాటులో ఉంటాడో లేదో సందేహమే. అయితే టీమిండియాలో ఇప్పటికే స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కో ప్లేస్‌కు ముగ్గురేసి ప్లేయర్లు పోటీపడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ జట్టుకు అవసరమా..? అనే చర్చ కొత్తగా మొదలైంది. కేఎల్ రాహుల్ గాయం కారణంగా పక్కకు తప్పుకోవడం వల్ల యువ ఆటగాళ్లకు తామేంటో నిరూపించుకునేందుకు అవకాశం వచ్చిందని కివీస్ మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్ అభిప్రాయపడ్డాడు.

సీనియర్లకే ప్రాధాన్యం..
'ఎవరైనా సరే జట్టు నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలి. ఇతర ప్లేయర్లు ఎవరూ తమ స్థానాల్లోకి రాకూడదని ఆటగాళ్లు భావిస్తుంటారు. అయితే భారత్‌లో మంచి సంప్రదాయం కొనసాగుతోంది. ఇతర ఆటగాళ్లకు అవకాశం కల్పించినా పెద్దగా పట్టించుకోరు. ఓ ఆటగాడిగా నేను కూడా నా స్థానంలో మరొక ఆటగాడికి అవకాశం ఇవ్వాలని కోరుకోను. ఇప్పుడు కేఎల్ రాహుల్ గాయం కారణంగా అందుబాటులో ఉండటం లేదు.

రాహుల్ అవసరమా..?
అందువల్లే సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాడికి అవకాశం వచ్చింది. దానిని అందిపుచ్చుకుంటున్నాడు. దీంతో సెలెక్టర్లకు కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కేఎల్ రాహుల్ అవసరమా..? వెనక్కి వచ్చినా ఫామ్‌లోనే ఉంటాడా..? ఇప్పటికే అతడు చాలా రోజుల నుంచి క్రికెట్ ఆడటంలేదు'' అంటూ కొత్త వాదనను స్టైరిస్ తెరపైకి తెచ్చాడు. మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రం రెండు వారాల్లోగా జట్టుకు అందుబాటులో ఉంటానని ట్విటర్ వేదికగా స్పష్టం చేశాడు.