న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీలంకతో సిరిస్: కెప్టెన్‌గా సర్ఫరాజ్‌‌‌వైపే మొగ్గు, మిస్బా సైతం!

Sarfraz retains Pakistan captaincy, Babar named deputy

హైదరాబాద్: శ్రీలంకతో త్వరలో జరగబోయే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సర్ఫరాజ్‌ కెప్టెన్‌గా కొనసాగుతాడని, వైస్ కెప్టెన్‌గా బాబర్ ఆజాం వైస్ కెప్టెన్‌గా కొనసాగుతాడని శుక్రవారం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వెల్లడించింది. ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన చేయడంతో కెప్టెన్ మార్పు అంశం తెరపైకి వచ్చింది.

వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ జట్టు గ్రూప్ స్టేజిని కూడా అధిగమించలేకపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హెడ్ కోచ్ మికీ ఆర్ధర్ కాంట్రాక్టుని పొడిగించని సంగతి తెలిసిందే. అతడి స్థానంలో హెడ్ కోచ్, చీఫ్ సెలక్టర్‌గా పాకిస్థాన్ మాజీ క్రికెట్ దిగ్గజం మిస్బా ఉల్ హాక్‌ను బోర్డు ఎంపిక చేసింది. ఇందుకోసం ఇంటర్యూలు కూడా నిర్వహించింది.

ధోని రిటైర్మెంట్ ట్వీట్‌పై వివరణ ఇచ్చుకున్న విరాట్ కోహ్లీ (వీడియో)ధోని రిటైర్మెంట్ ట్వీట్‌పై వివరణ ఇచ్చుకున్న విరాట్ కోహ్లీ (వీడియో)

అయితే, హెడ్ కోచ్‌గా నియమింపబడ్డ మిస్బా సైతం సర్ఫరాజ్ వైపే మొగ్గు చూపడంతో మూడు ఫార్మాట్లకు పాకిస్థాన్ జట్టు కెప్టెన్‌గా సర్ఫరాజే కొనసాగుతాడని పీసీబీ అధికారిక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ మాట్లాడుతూ "దేవుడి దయ వల్ల శ్రీలంక జట్టు ఇక్కడ పర్యటిస్తుంది. అంతా మంచే జరగాలని మనం కోరుకోవాలి" అని అన్నాడు.

"పాక్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లను నిర్వహించాలని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు పదేళ్ల నుంచి ఎంతో శ్రమిస్తోంది. అందుకోసం మనమంతా ప్రార్థించాలి. ఈ విషయంలో ఐసీసీ, ఇతర దేశాల బోర్డులు ముందుకు రావాలి" అని సర్ఫరాజ్ అన్నాడు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌ను తటస్థ వేదికకు మార్చడానికి శ్రీలంక చేసిన విన్నపాన్ని పీసీబీ తిరస్కరించింది.

పాకిస్తాన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్వవైభవం తీసుకురావాలనే వారి ప్రణాళికలు ప్రమాదంలో పడుతాయని పీసీబీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెలలో లంక జట్టు పాక్‌లో వన్డే, టీ20 సిరీస్‌ కోసం పర్యటించాల్సి ఉంది. ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను కరాచీ, లాహోర్‌లో ఆడాల్సి ఉంది.

అంబటి రాయుడు ఈజ్ బ్యాక్: హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికఅంబటి రాయుడు ఈజ్ బ్యాక్: హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక

అయితే భద్రతా కారణాల రీత్యా లంక కెప్టెన్లు దిముత్ క‌రుణ‌ర‌త్నే, ల‌సిత్ మ‌లింగ‌.. ఏంజిలో మాథ్యూస్ లాంటి సీనియర్ ఆట‌గాళ్లతో పాటు మొత్తం 10 మంది పాక్ పర్యటనను నిరాకరించారు. సెప్టెంబర్‌ 27వ తేదీ నుంచి అక్టోబర్‌ 9వ తేదీ వరకూ ఇరు జట్ల మధ్య సిరీస్‌ జరగాల్సి ఉంది. పాక్‌లో పర్యటనలో లంక జట్టుపై ఉగ్రదాడి జరిగే అవకాశముందని శ్రీలంక ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారం అందింది.

దీంతో పాకిస్తాన్‌లో జరగాల్సిన మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహిస్తే బాగుంటుందని శ్రీలంక క్రికెట్‌ బోర్డు పీసీబీకి విన్నవించుకుంది. తాజాగా లంక విన్నపాన్ని పీసీబీ తిరస్కరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ షెడ్యూల్‌ను మార్చబోమని స్పష్టం చేసింది. స్వదేశీ సిరీస్‌ను తటస్థ వేదికపై నిర్వహించే ప్రశ్నే లేదని పీసీబీకి చెందిన అధికారి ఒకరు పేర్కొన్నారు.

Story first published: Saturday, September 14, 2019, 18:01 [IST]
Other articles published on Sep 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X