న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పదేళ్ల తర్వాత కరాచీలో వన్డే మ్యాచ్: చరిత్రలో భాగస్వామ్యం కావాలని అభిమానులకు పాక్ కెప్టెన్ పిలుపు

 Sarfraz Ahmed urges Pakistan fans to be part of history as they host Sri Lanka in Karachi

హైదరాబాద్: చరిత్రలో భాగస్వామ్యం కావాలని పాకిస్థాన్ అభిమానులకు ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మాద్ సూచించాడు. పదేళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై ద్వైపాక్షిక సిరిస్ జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు స్టేడియాలకు రావాలని పిలుపునిచ్చాడు.

మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా కరాచీ వేదికగా సెప్టెంబర్ 27న శ్రీలంకతో పాకిస్థాన్ జట్టు తొలి వన్డేతో తలపడనుంది. జనవరి 2009 తర్వాత కరాచీ వేదికగా జరుగుతున్న మొట్టమొదటి వన్డే ఇదే కావడం విశేషం. పాక్ పర్యటనలో శ్రీలంక జట్టు 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది.

పాక్ కెప్టెన్ మాట్లాడుతూ

పాక్ కెప్టెన్ మాట్లాడుతూ

ఈ సందర్భంగా పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మాద్ మాట్లాడుతూ "శుక్రవారం చరిత్ర సృష్టించబడుతుంది. ద్వైపాక్షిక సిరిస్‌లో భాగంగా జనవరి 2009 తర్వాత కరాచీలో వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ చరిత్రలో క్రికెట్ అభిమానులు భాగస్వామ్యం కావాల్సిందిగా నేను కోరుతున్నాను. ఫలితంగా నేషనల్ స్టేడియంలో అంతర్జాతీయ సిరీస్ జరిగిందని ఆ తర్వాతి తరానికి తెలియజేయవచ్చు" అని ఐసీసీతో అన్నాడు.

శుక్రవారం వరకు ఆగలేకపోతున్నా

శుక్రవారం వరకు ఆగలేకపోతున్నా

"శుక్రవారం వరకు ఆగలేకపోతున్నాను. ఇది చిరస్మరణీయ సందర్భం గుర్తు చేస్తుంది. నేను బయటికి వెళ్ళినప్పుడు, నా వెనుక అభిమానులు మొత్తం ఉన్నారని... నన్ను ఉత్సాహపర్చడమే కాదు... ఇరు జట్లను" అని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపాడు. ఇటీవలే పాక్ వైస్ కెప్టెన్‌గా ఎంపికైన బాబర్ అజామ్ శుక్రవారాన్ని తన జీవితంలో మరిచిపోలేని రోజుగా అభివర్ణించాడు.

బాబర్ అజామ్ మాట్లాడుతూ

బాబర్ అజామ్ మాట్లాడుతూ

బాబర్ అజామ్ మాట్లాడుతూ "నా కెరీర్ ప్రారంభ రోజుల్లో నా అభిమానులందరి నుండి నాకు లభించిన ప్రేమ, గౌరవానికి నేను తగినంత కృతజ్ఞతలు చెప్పలేను. పాకిస్థాన్ వైస్ కెప్టెన్‌గా నేను మైదానంలో బరిలోకి దిగే శుక్రవారం నా అతిపెద్ద రోజులలో ఒకటి. దేశం మొత్తం, అలాగే నేషనల్ స్టేడియంలోని ప్రేక్షకులు గుర్తుంచుకునే రోజుగా మార్చుకోవాలని నేను కోరుకుంటున్నా" అని అన్నాడు.

3 వన్డేలు, 3 టీ20ల కోసం

పాకిస్థాన్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 ఆడేందుకు శ్రీలంక జట్టు మంగళవారం ఉదయం కొలంబో నుంచి పాకిస్థాన్‌కు బయలుదేరింది. అయితే వెళ్లే ముందు లంక ఆటగాళ్లు పూర్తి జాగ్రత్తలు తీసుకుని మరీ బయల్దేరిన సంగతి తెలిసిందే. భద్రతాపరమైన అనుమానాలతో కెప్టెన్‌లు లసిత్ మలింగా, దిముత్ కరుణరత్నే సహా పలువురు సీనియర్‌ ఆటగాళ్లు పాక్ పర్యటనకు దూరంగా ఉన్నారు.

సీనియర్‌ ఆటగాళ్లు వెళ్లబోమని తెగేసి చెప్పడంతో

సీనియర్‌ ఆటగాళ్లు వెళ్లబోమని తెగేసి చెప్పడంతో.. శ్రీలంక బోర్డు యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చి వారిని అక్కడికి పంపించింది. పాక్ పర్యటనకు బయల్దేరడానికి ముందు శ్రీలంక జట్టులోని ఆటగాళ్లు అందరూ బౌద్ధ గురువుతో తాయెత్తులు కట్టించుకున్నారు. తాయెత్తులకు సంబందించిన పోటోలను లంక బోర్డు ట్విటర్‌లో పోస్టు చేసింది.

లంక పెద్ద సాహసమే

లంక పెద్ద సాహసమే

2009లో పాక్‌ పర్యటన సందర్భంగా.. శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో ఆరుగురు లంక ఆటగాళ్లు గాయపడగా.. ఆరుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఉగ్రదాడి తర్వాత ఆ దేశంలో పర్యటించేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావడం లేదు. ఎట్టకేకలకు లంక సాహసం చేస్తోంది.

Story first published: Wednesday, September 25, 2019, 16:06 [IST]
Other articles published on Sep 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X