న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'సర్ఫరాజ్‌ విషయంలో ఐసీసీ కాస్త అతిగా స్పందించింది'

 Sarfraz Ahmeds 4-match ban utter nonsense, PCB chief Ehsan Mani slams ICC

హైదరాబాద్: దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఆండిల్‌ పెహ్లువాకియాపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినందుకు పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌పై ఐసీసీ నాలుగు వన్డేల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, సర్ఫరాజ్‌పై ఐసీసీ నాలుగు వన్డేల నిషేధం వేయడాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తప్పుబట్టింది. తాను తప్పు చేసినట్లు బహిరంగంగా ఒప్పుకున్న సర్ఫరాజ్ క్షమాపణలు చెప్పడంతో పాటు.. వ్యక్తిగతంగా అతడిని కలిసి మరీ సారీ చెప్పినా ఐసీసీ అనాలోచితంగా చర్యలు తీసుకుందని పీసీబీ చీఫ్ ఇషాన్ మణి విమర్శించారు.

పీసీబీ చీఫ్ మాట్లాడుతూ

పీసీబీ చీఫ్ మాట్లాడుతూ

ఆయన మాట్లాడుతూ "ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై సర్ఫరాజ్ బహిరంగ క్షమాపణలు కోరాడు. ఇందుకు అంతా అంగీకరించారు. దక్షిణాఫ్రికా బోర్డుతో పాక్‌కి సత్సంబంధాలు ఉన్నాయి. పెహ్లువాకియా‌ ఆ వ్యాఖ్యలపై బాధపడ్డాడని భ్రమించిన ఐసీసీ మధ్యలోకి వచ్చి సర్ఫరాజ్ అహ్మద్‌పై చర్యలు తీసుకుంది. అసలు సర్ఫరాజ్‌పై సస్పెన్షన్ వేయాల్సిన అవసరం ఏంటి? క్రికెటర్లు ఏమైనా స్కూల్ పిల్లలు అనుకుంటున్నారా?" అని ఇషాన్ మణి మండిపడ్డాడు.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

దక్షిణాప్రికాతో జరిగిన రెండో వన్డేలో ఫెలుక్వాయోను ఉద్దేశించి 'ఒరేయ్‌.. నల్లోడా! ఈరోజు మీ అమ్మ ఎక్కడ కూర్చుంది? నీకు ఏం కావాలని ఆమెను అడిగావు' అని సర్ఫరాజ్‌ దూషించిన వ్యాఖ్యలు స్టంప్స్‌మైక్‌లో రికార్డు కావడంతో అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యల పట్ల దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ ఫెలుక్వాయోకు సర్ఫరాజ్ క్షమాపణలు చెప్పినప్పటికి నిబంధనల మేరకు ఐసీసీ అతడిపై చర్యలకు ఉపక్రమించింది.

సర్ఫరాజ్‌ మీడియాతో

సర్ఫరాజ్‌ మీడియాతో

ఈ నిషేధంతో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా స్వదేశానికి తిరిగొచ్చిన సర్ఫరాజ్‌ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా సర్ఫరాజ్ మాట్లాడుతూ "అక్తర్‌ వ్యక్తిగతంగా దాడి చేశాడు. అతని మాటలు విమర్శల్లా లేవు. ఇప్పటికే నేను నా తప్పును అంగీకరించాను. దక్షిణాఫ్రికా ఆటగాడితో అలా ప్రవర్తించడం తప్పే. ఇందుకు చింతిస్తున్నా" అని చెప్పుకొచ్చాడు.

పాక్ సూపర్‌ లీగ్‌లో ఆడతా

పాక్ సూపర్‌ లీగ్‌లో ఆడతా

"ఈ తప్పు నుంచి ఎంతో నేర్చుకున్నా. క్షమాపణ కూడా చెప్పాను. ఇలాంటి పరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన పాక్‌ క్రికెట్‌ బోర్డ్‌(పీసీబీ)కు ధన్యవాదాలు. నాపై ఐసీసీ విధించిన నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని కూడా అంగీకరిస్తున్నా. ఈ వివాదం ఇంతటితో ముగిసింది. పీసీబీ ఏం చెప్పినా పాటించడానికి సిద్ధంగా ఉన్నా. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో కూడా ఆడతాను" అని సర్ఫరాజ్ అన్నాడు.

Story first published: Friday, February 1, 2019, 16:26 [IST]
Other articles published on Feb 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X