అనుష్కను చూడలేదు.. కనీసం మాట్లాడలేదు: భారత మీడియాపై పాక్ కెప్టెన్

Posted By:
Sarfaraz takes a dig at Indian media over ‘Mauka Mauka’ episode

హైదరాబాద్: 2017 ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం భారత మీడియా తనను వెక్కిరించిందని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించాడు. పాక్ టీవీ ఛానెల్ సామా.టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో భారత మీడియాపై సర్ఫరాజ్ అహ్మద్ మండిపడ్డాడు. గతేడాది లండన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగిన సంగతి తెలిసిందే.

 ఫైనల్లో భారత్‌పై పాకిస్థాన్ ఘన విజయం

ఫైనల్లో భారత్‌పై పాకిస్థాన్ ఘన విజయం

ఈ టోర్నీ పైనల్లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఫైనల్లో భారత్‌పై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. ఆనంతరం సర్ఫరాజ్ ఆ ట్రోఫీతో పాకిస్థాన్‌కు వెళ్లిన సర్ఫరాజ్ అహ్మద్ ‘మోకా-మోకా' పాటను పాడాడు. అయితే ఈ పాట పాడినందుకు భారత మీడియా తనపై విమర్శలు చేసిందని సర్ఫరాజ్ పేర్కొన్నాడు.

మోకా-మెకా పాటపై పాక్ కెప్టెన్

మోకా-మెకా పాటపై పాక్ కెప్టెన్

'నేను మోకా-మెకా పాట పాడటాన్ని ఇండియాన్ మీడియా కవర్ చేసిన తీరు చూసి నవ్వొచ్చింది. ఆ క్లిప్‌తో చూపించే ప్రతి బులెటిన్‌లో నన్ను ట్యాగ్ చేసి నాపై విమర్శలు గుప్పించారు' అని సర్ఫరాజ్ తెలిపాడు. 2016 వరల్డ్ కప్ సమయంలో పాక్‌పై స్టార్ ఇండియా మోకా మోకా పాటని విడుదల చేసింది.

గత కొన్నేళ్లుగా వెక్కిరిస్తూ ఆ పాటని పాడారు

గత కొన్నేళ్లుగా వెక్కిరిస్తూ ఆ పాటని పాడారు

అప్పట్లో ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీలో తమ చిరకాల ప్రత్యర్థి భారత్‌ను ఓడించిన తర్వాత ఆ విజయోత్సాహంతో సర్ఫరాజ్ ఆ పాటను పాడాడు. 'మీరు మమ్మల్ని గత కొన్నేళ్లుగా వెక్కిరిస్తూ ఆ పాటని పాడారు. కానీ నేను ఒకసారి పాడితేనే నన్ను ఇంతలా విమర్శిస్తారా?' అని సర్ఫరాజ్ ఈ విషయాన్ని ప్రస్తావించాడు.

అనుష్కను చూడలేదు.. కనీసం మాట్లాడలేదు

అనుష్కను చూడలేదు.. కనీసం మాట్లాడలేదు

ఇక, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మను ఎప్పుడు చూడలేదని, ఆమెతో మాట్లాడలేదని సర్ఫరాజ్ అహ్మద్ అన్నాడు. 'అమెను గతంలో ఎప్పుడు చూడలేదు.. కనీసం మాట్లాడలేదు. కానీ ఆమెకు నేను ఎవరో తెలిసే ఉండొచ్చు' అని సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, April 10, 2018, 19:31 [IST]
Other articles published on Apr 10, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి