న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనిని కాపీ కొట్టావా?: పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌పై నెటిజన్ల జోకులు

By Nageshwara Rao
Sarfaraz Ahmed trolled by Twitterati for failing to copy MS Dhoni's full split in PAK vs NZ, 1st T20I

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని కాపీ కొట్టావా? అంటూ పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు వేస్తున్నారు. పరిమిత ఓవర్ల సిరిస్ కోసం పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్‌ను వన్డే సిరీస్‌లో 5-0తో వైట్‌ వాష్‌ చేయగా మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సైతం న్యూజిలాండ్ విజయం సాధించింది. పాకిస్తాన్‌ నిర్దేశించిన 106 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 25 బంతులుండగానే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఔటైన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు వేస్తున్నారు. గతేడాది భారత్‌ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని తన టెక్నిక్‌తో స్టంప్‌ ఔట్‌ నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే.

అప్పట్లో ధోనిపై సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిసింది. అదే విధంగా ఔట్ నుంచి తప్పించుకునేందుకు సర్ఫరాజ్‌ తొలి టీ20లో ప్రయత్నించాడు. అక్కడ ఔట్ నుంచి ధోని తప్పించుకోగా, ఇక్కడ సర్ఫరాజ్ ఔట్ కావడం విశేషం. దీంతో సర్ఫరాజ్ ఔట్ ఫోటోలను నెటిజన్లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ట్రోల్‌ చేస్తున్నారు.

ఈ సిరీస్‌లో సర్ఫరాజ్‌ నేర్చుకున్న టెక్నిక్‌ ఇదే అని ఒక నెటిజన్ ట్వీట్ చేయగా... లెజెండ్స్‌ను ఎప్పుడు ఫాలో కావాలని ఇంకో నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇతరుల టెక్నిక్‌‌ను కాపీ చేస్తే ఇలానే అవుతుందని మరోకరు నెటిజన్ కామెంట్‌ చేశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 24, 2018, 9:41 [IST]
Other articles published on Jan 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X