న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా సంజూ శాంసన్.. తెలుగోళ్లకు చాన్స్!

Sanju Samson To Lead India A In One-Day Series vs New Zealand A

న్యూఢిల్లీ: న్యూజిలాండ్-ఏ జట్టుతో జరగనున్న అనధికారిక వన్డే సిరీస్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 22 నుంచి చెన్నై వేదికగా జరగనున్న ఈ మూడు వన్డేల సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) శుక్రవారం ప్రకటించింది. సంజూ శాంసన్‌ను టీ20 ప్రపంచకప్‌కు పక్కనపెట్టిన భారత సెలెక్టర్లు.. న్యూజిలాండ్‌తో అనధికారిక వన్డే సిరీస్‌కు ఎంపికచేశారు. ప్రపంచకప్‌ ముందు సౌతాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసమే అతన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన ఆటగాళ్లంతా దూరం కానున్నారు. అక్టోబర్ 6 నుంచి ఈ సిరీస్ ప్రారంభంకానుండగా.. సంజూ శాంసన్, శిఖర్ ధావన్, సిరాజ్ వంటి ఆటగాళ్లతో కూడిన ద్వితీయ శ్రేణి జట్టు బరిలోకి దిగనుంది.

న్యూజిలాండ్ ఏతో ఆడనున్న భారత్ ఏ జట్టులో తెలుగు క్రికెటర్లు కేఎస్ భరత్, తిలక్ వర్మ చోటు దక్కించుకున్నారు. న్యూజిలాండ్‌ ఏతో అనధికారిక టెస్ట్ సిరీస్ ఆడుతున్న యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్, అభిమన్యూ ఈశ్వరన్, రుతరాజ్ గైక్వాడ్, రజత్ పాటిదార్‌, శార్దూల్ ఠాకూర్‌, నవ్‌దీప్ సైనీలు కూడా అవకాశం దక్కించుకున్నారు. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు డ్రా కాగా.. బెంగళూరు వేదికగా మూడో మ్యాచ్ జరగుతుంది. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే సెప్టెంబర్ 22, 25, 27 తేదీల్లో చెన్నై వేదికగా మూడు వన్డేల అనధికారిక సిరీస్ జరగనుంది. హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా రాజ్‌భావాను సిద్దం చేస్తున్నారు. ఈక్రమంలోనే అతన్ని అనధికారిక వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు.

న్యూజిలాండ్ ఏతో వన్డే సిరీస్‌కు ఎంపికైన ఇండియా ఏ జట్టు:
సంజూ శాంసన్, పృథ్వీ షా, అభిమన్యూ ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, రజత్ పాటిదార్, కేఎస్ భరత్(వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, షాబాజ్ అహ్మద్, రాహుల్ చాహర్, తిలక్ వర్మ, కుల్దీప్ సేన్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, నవ్‌దీప్ సైనీ, రాజ్‌ అంగద్ బవా

Story first published: Friday, September 16, 2022, 19:11 [IST]
Other articles published on Sep 16, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X