న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ పదవికి గంగూలీ అనర్హుడు.. సవాల్‌ చేసిన సంజీవ్‌ గుప్తా!!

Sanjeev Gupta says Sourav Ganguly cannot continue as BCCI chief

న్యూఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ కొనసాగడాన్ని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం సభ్యుడు సంజీవ్‌ గుప్తా సవాల్‌ చేశాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) బోర్డుకు నామినేట్‌ అయిన వారు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండేందుకు అనర్హులని బోర్డు రాజ్యాంగం చెబుతోందన్నాడు. బీసీసీఐ నిబంధనల్లో ఇది స్పష్టంగా ఉందని తెలుపుతూ గంగూలీతో సహా బోర్డు సభ్యులకు గుప్తా ఈమెయిల్‌ పంపాడు.

టీ20 ప్రపంచకప్‌ వాయిదా వేయొద్దు.. నిర్వాహకులకు సమయం ఇవ్వాలి!!టీ20 ప్రపంచకప్‌ వాయిదా వేయొద్దు.. నిర్వాహకులకు సమయం ఇవ్వాలి!!

దాదా కొనసాగడం కష్టం:

దాదా కొనసాగడం కష్టం:

మార్చి 28న జరిగిన సమావేశంలో బీసీసీఐ ప్రతినిధిగా సౌరవ్ గంగూలీ ఐసీసీ బోర్డుకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే ఐసీసీ చైర్మన్‌ పదవికి పోటీచేసే అర్హతను దాదా సాధించాడు. అయితే బీసీసీఐ రూల్‌ 14(9) ప్రకారం ఐసీసీకి నామినేట్‌ అయితే.. బీసీసీఐ చీఫ్‌ పోస్టు అప్పటి నుంచే ఖాళీ అవుతుందని సంజీవ్‌ గుప్తా అంటున్నాడు. అయితే గుప్తా వాదనలను బీసీసీఐ బోర్డు అధికారి ఒకరు కొట్టిపడేశారు. గతేడాది జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎమ్‌)లో తీసుకున్న నిర్ణయాల అమలుపై బోర్డు మరోమారు సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

ఐసీసీ కీలక సమావేశాలు:

ఐసీసీ కీలక సమావేశాలు:

మంగళవారం నుంచి మూడు రోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఐసీసీ కీలక సమావేశాలు జరుగబోతున్నాయి. ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐసీసీ ఛైర్మన్‌ పదవికి నామినేషన్లు, ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చించనున్నారు. ఉమ్మిపై నిషేధం వంటి తదితర అంశాలు కూడా చర్చకు రానున్నాయి. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వాయిదాపై ఆతిథ్య క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సుముఖంగానే ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే ప్రపంచకప్‌ వాయిదా పడితే మళ్లీ ఎప్పుడు నిర్వహించాలన్నది ఐసీసీ, సీఏకు సవాల్‌గా మారింది.

 అధ్యక్షుడిగా గంగూలీనే సరైనోడు:

అధ్యక్షుడిగా గంగూలీనే సరైనోడు:

క‌రోనా వైర‌స్ సంక్షోభం స‌మ‌యంలో ఐసీసీని లీడ్ చేసేందుకు స‌మ‌ర్థులు కావాల‌ని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, క్రికెట్ సౌతాఫ్రికా డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ ఇటీవలే అభిప్రాయ‌ప‌డ్డాడు. భార‌త మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీనే ఐసీసీ అధ్యక్షుడిగా సరైనోడు అని పేర్కొన్నాడు. 'ఇప్పుడు ఐసీసీ అధ్యక్షుడిగా ఓ బలవంతమైన వ్యక్తి కావాలి. కరోనా వైరస్ తర్వాత క్రికెట్‌కి ఓ బలమైన నాయకుడి అవసరం వచ్చింది. ఇప్పుడు మళ్లీ క్రికెట్‌ని మామూలు స్థితికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో ఐసీసీ న‌డ‌పాలంటే.. ఆధునిక క్రికెట్‌తో ప‌రిచ‌య‌ముండ‌టంతో పాటు మంచి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలున్న గంగూలీనే సరైనోడు. గంగూలీ వంటి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ఉత్తమం' అని స్మిత్ అన్నాడు.

 ఏదో ఒక రోజు దాదా ఐసీసీకి నాయకత్వం వహిస్తాడు:

ఏదో ఒక రోజు దాదా ఐసీసీకి నాయకత్వం వహిస్తాడు:

సౌరవ్ గంగూలీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ ఇటీవలే ప్రశంసల వర్షం కురిపించాడు. ఐసీసీని నడిపించేంత రాజకీయ నైపుణ్యం గంగూలీకి ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. వరల్డ్‌ క్రికెట్‌లో బీసీసీఐని నడపడం అత్యంత కష్టమన్నాడు. కఠినమైన బీసీసీఐ అధ్యక్ష పదవిని ఇట్టే నిర్వహిస్తున్న గంగూలీ.. ఏదో ఒక రోజు ఐసీసీకి నాయకత్వం వహిస్తాడని గోవర్ జోస్యం చెప్పాడు. ఐసీసీ ప్ర‌స్తుత చైర్మ‌న్ శ‌శాంక్ మనోహ‌ర్ కూడా భార‌తీయుడే కావ‌డం విశేషం. అయితే మే నెల త‌ర్వాత త‌న ప‌ద‌వీకాలం ముగిసిపోనుండ‌టంతో.. తిరిగి ఎక్స్‌టెన్ష‌న్ కోర‌బోన‌ని గ‌తంలోనే మ‌నోహ‌ర్ తెలిపారు.

Story first published: Tuesday, May 26, 2020, 10:22 [IST]
Other articles published on May 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X