న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 క్రికెట్‌కు అశ్విన్ పనికిరాడు.. సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు!

Sanjay Manjrekar says R Ashwin Has Not Been A Wicket-Taker In T20 Cricket
IPL 2021 : Would Never Have Him In My T20 Team - Sanjay Manjrekar || Oneindia Telugu

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌ టీ20 ఫార్మాట్ పనికిరాడని మాజీ క్రికెటర్ సంజయ్ మ్రంజ్రేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
టీ20 ఫార్మాట్‌లో అతనికి వికెట్లు తీసే సామర్ధ్యమే లేదని పేర్కొన్నాడు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో అశ్విన్‌ను ఎందుకు ఆడిస్తున్నారో అర్ధం కావడం లేదని, నేనైతే అశ్విన్‌ను అసలు జట్టులోకే తీసుకోనని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్‌ఫో టైమ్ ఔట్ లైవ్ షోలో.. మాట్లాడుతూ అశ్విన్‌పై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు.

అశ్విన్ పనికిరాడు..

అశ్విన్ పనికిరాడు..

'టీ20 ప్రపంచకప్ జట్టులో అశ్విన్‌ను అనవసరంగా తీసుకున్నారు. అశ్విన్‌ గురించి మాట్లాడుతూ.. ఇప్పటికే చాలా సమయాన్ని వృధా చేశాం. టీ20 బౌలర్‌గా అతను ఏ జట్టుకు కూడా ఉపయోగపడింది లేదు. టీ20 ఫార్మాట్‌లో అశ్విన్‌ బౌలింగ్‌ శైలి మారాలనుకుంటే అది జరిగేది ​కాదు. గత ఐదారేళ్లుగా ఐపీఎల్‌లో అతను ప్రాతినిథ్యం వహించిన ప్రతి జట్టుకు భారంగానే ఉన్నాడు. టర్నింగ్‌ వికెట్లపై నేనైతే వికెట్‌ టేకింగ్‌ బౌలర్ల అయిన వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌, యుజ్వేంద్ర చహల్‌‌లను ఎంచుకుంటాను. టెస్ట్‌ ఫార్మాట్‌లో అశ్విన్‌‌కు తిరుగు లేదు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అతనో అద్భుతమైన బౌలర్. కానీ టీ20 ఫార్మాట్‌కు మాత్రం అతని బౌలింగ్ అస్సలు పనికిరాదు.'అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

13 మ్యాచ్‌లు.. 7 వికెట్లే..

13 మ్యాచ్‌లు.. 7 వికెట్లే..

ఐపీఎల్‌-2021 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌‌రైడర్స్‌తో బుధవారం జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో అశ్విన్ వరుస బంతుల్లో వికెట్లు తీసి ఢిల్లీ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. అయితే ఐదో బంతికి రాహుల్ త్రిపాఠి భారీ సిక్సర్ బాదడంతో కేకేఆర్ విజయం లాంఛనమైంది. అయితే ఐపీఎల్ 2021 సీజన్‌లో అశ్విన్ దారుణంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్‌ల్లో కేవలం 7 వికెట్లు మాత్రమే తీసాడు. యూఏఈ వంటి టర్నింగ్ ట్రాక్‌లపై దారుణంగా విఫలమయ్యాడు.

కేకేఆర్ థ్రిల్లింగ్ విక్టరీ..

కేకేఆర్ థ్రిల్లింగ్ విక్టరీ..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలలో 5 వికెట్లకు 135 రన్స్ చేసింది. శ్రేయస్ అయ్యర్(27 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 30 నాటౌట్), శిఖర్ ధావన్(39 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 36) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ రెండు వికెట్లు తీయగా.. ఫెర్గూసన్, శివం మావి తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన కేకేఆర్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 136 పరుగులు చేసి ఓ బంతి మిగిలుండగానే గెలుపొందింది. వెంకటేశ్ అయ్యర్(41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీతో రాణించగా..శుభ్‌మన్ గిల్ (46 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్, కగిసో రబడా, రవిచంద్రన్ అశ్విన్ రెండేసి వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Thursday, October 14, 2021, 22:17 [IST]
Other articles published on Oct 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X