న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఓపెనర్‌గా రోహిత్ శర్మ సక్సెస్ అయితే భారత్‌కు తిరుగుండదు'

Sanjay Banger Urges Rohit To ‘Maintain Individuality’ As Opener In Tests
Sanjay Bangar urges Rohit Sharma to maintain his individuality if he opens in Tests

హైదరాబాద్: టెస్టుల్లో రోహిత్ శర్మ గనుక ఓపెనర్‌గా సక్సెస్ అయితే భారీ లక్ష్యాలను సైతం టీమిండియా అలవోకగా చేధిస్తుందని మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు 15 మందితో కూడిన జట్టును గురువారం సెలక్టర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అందరూ ఊహించినట్లే ఈ జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు చోటు దక్కలేదు. అతడి స్థానంలో సెలక్టర్లు యువ క్రికెటర్ శుభమాన్ గిల్‌కు చోటు కల్పించారు. మరోవైపు రోహిత్ శర్మను తిరిగి టెస్టులకు ఎంపిక చేశారు. దీంతో మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు.

యాషెస్ 2019: 71 ఏళ్ల రికార్డుని సమం చేసిన స్టీవ్ స్మిత్యాషెస్ 2019: 71 ఏళ్ల రికార్డుని సమం చేసిన స్టీవ్ స్మిత్

సంజయ్ బంగర్ మాట్లాడుతూ

సంజయ్ బంగర్ మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో సంజయ్ బంగర్ మాట్లాడుతూ "సఫారీ పర్యటనలో రోహిత్ శర్మ తన సహజ సిద్ధమైన ఆటతో ఆడాలి. అతని సక్సెస్‌ సూత్రం అదే. దీన్ని టెస్టు ఫార్మాట్‌లో కూడా కొనసాగించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత టెస్టు జట్టులో మిడిల్‌ ఆర్డర్‌లో పోటీ ఉంది. దాంతో రోహిత్‌కు ఓపెనింగ్‌ సవాల్ ఎదురుకానుంది" అని తెలిపాడు.

సుదీర్ఘ ఫార్మాట్‌లో

సుదీర్ఘ ఫార్మాట్‌లో

"సుదీర్ఘ ఫార్మాట్‌లో రోహిత్‌ సక్సెస్‌ అయిన సందర్భాలు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో రోహిత్‌కు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మైదానంలోని గ్యాప్‌లను చూసి మరీ రోహిత్ శర్మ బంతిని బలంగా బాదగలడు. దీంతో బ్యాటింగ్‌లో తన టర్న్ వచ్చే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు, ఇది అతడి మెంటర్ ఎనర్జీని ఆదా చేస్తుంది" అని బంగర్ చెప్పుకొచ్చాడు.

27 టెస్టు మ్యాచ్‌లు ఆడి 1585 పరుగులు

27 టెస్టు మ్యాచ్‌లు ఆడి 1585 పరుగులు

రోహిత్‌ శర్మ ఇప్పటివరకూ 27 టెస్టు మ్యాచ్‌లు ఆడి 1585 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 10 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. సగటు మాత్రం 39.62గా ఉంది. టెస్టుల్లో రోహిత్‌ అత్యధిక వ్యక్తిగత స్కోరు 177. గత వెస్టిండీస్‌ పర్యటనకు రోహిత్‌ను ఎంపిక చేసినా టెస్టుల్లో ఆడే అవకాశం దక్కలేదు

ఓపెనర్‌గా రోహిత్ శర్మ

ఓపెనర్‌గా రోహిత్ శర్మ

ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌-మయాంక్‌ అగర్వాల్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించగా, హనుమ విహారి ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. దీంతో రోహిత్‌ రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. తాజాగా సఫారీతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో రాహుల్‌కు జట్టులో చోటు దక్కకపోవడంతో రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.

Story first published: Saturday, September 14, 2019, 13:13 [IST]
Other articles published on Sep 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X