న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sanjay Bangar: న్యూజిలాండ్‌తో పోరులో అశ్విన్‌కే అవకాశం!

Sanjay Bangar says R Ashwin may replace Varun Chakravarthy for India’s clash against New Zealand:

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మరికొద్ది సేపట్లో న్యూజిలాండ్‌తో జరిగే కీలక పోరులో రవిచంద్రన్ అశ్విన్ ఆడటం ఖాయమని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. క్వార్టర్ ఫైనల్ వంటి ఈ పోరులో యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బదులు సీనియర్ ఆఫ్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్వినే ఆడించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్‌తో చిత్తయిన భారత్.. టోర్నీలో ముందుకు సాగాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. మరోవైపు న్యూజిలాండ్‌ది కూడా అదే పరిస్థితి. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తినెలకొంది. ఇప్పటికే మాజీ క్రికెటర్లు టీమిండియా కాంబినేషన్‌పై పలు సూచనలు చేశారు. ఈ క్రమంలోనే సంజయ్ బంగర్ సైతం తన అభిప్రాయాలను వెల్లడించాడు.

అశ్విన్‌కే చాన్స్..

అశ్విన్‌కే చాన్స్..

అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'భారత జట్టు అనుభవం లేని వరుణ్‌ కన్నా అశ్విన్‌కే చోటిచ్చే అవకాశం ఉంది. యూఏఈలో ఇటీవల వరుణ్‌ ప్రదర్శన ఏమంత ఆకట్టుకునేలా లేదు. అతను షార్జాలో ప్రభావం చూపినంత దుబాయ్‌లో చూపలేకపోతున్నాడు. మరోవైపు ఇది టీమిండియాకు చావోరేవో లాంటి మ్యాచ్‌. ఈ నేపథ్యంలోనే కచ్చితంగా సీనియర్‌ స్పిన్నర్‌కే అవకాశం ఇవ్వవచ్చు.'అని అన్నాడు. కాగా, పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు ఒక్క వికెట్‌ కూడా సాధించకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే భువనేశ్వర్‌కుమార్‌ను తొలగించి శార్దూల్‌ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకోవాలనే అభిప్రాయాలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండి యా కచ్చితంగా మార్పులతోనే బరిలోకి దిగేలా కనిపిస్తోంది.

నాలుగో స్థానంలో జడేజా..

నాలుగో స్థానంలో జడేజా..

ఇక భారత్ నాలుగో స్థానంలో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను ఆడించాలని బెంగాల్‌ క్రికెటర్‌ మనోజ్‌ తివారి సూచించాడు. తాజాగా ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడిన తివారి.. భారత జట్టు ఆట తీరుపై స్పందించాడు. పాక్‌తో ఓటమి, తిరిగి పుంజుకునే విషయాలపై కూడా తన ఆలోచనలు పంచుకున్నాడు. కోహ్లీసేన బ్యాటింగ్‌ ఆర్డర్‌ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని, టాప్‌ ఆర్డర్‌ వైఫల్యమే దాయాదుల పోరులో ఓటమికి కారణమైందని అతడు వెల్లడించాడు. 'నేను ఇంతకుముందు చెప్పినట్టు రవీంద్ర జడేజాను నాలుగో స్థానానికి ప్రమోట్ చేయాలి. ఎందుకంటే న్యూజిలాండ్‌తో మనం కీలకమైన మ్యాచ్‌ ఆడుతున్నాం. జడేజా తర్వాత రిషబ్ పంత్ క్రీజులోకి రావాలి. చివరి ఓవర్లలో పంత్ చెలరేగుతాడు' అని తివారి అన్నాడు.

లెఫ్టా రైట్ కాంబినేషన్‌లోనే..

లెఫ్టా రైట్ కాంబినేషన్‌లోనే..

'టాప్‌ ఆర్డర్‌లో నలుగురు ఆటగాళ్లు కుడి చేతి వాటం గల బ్యాటర్లు ఉన్నారు. అలా కాకుండా నాలుగో స్థానంలో ఎడమచేతి వాటం గల రవీంద్ర జడేజాను పంపించాలి. అలా చేస్తే బౌలర్లకు ఇబ్బందిగా మారి లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బౌలింగ్‌ చేయలేరు. అయితే నాలుగో స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్ లేదా రిషబ్ పంత్‌ను టీమిండియా పంపుతోంది. కానీ జడేజా ఇటీవలి కాలంలో మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడు స్రైక్‌ రొటేట్‌ చేస్తూ బౌండరీలు బాదుతూ పరుగులు సాధిస్తాడు. జడేజాను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపే ప్రయత్నం చేస్తే బాగుంటుంది' అని మనోజ్‌ తివారి పేర్కొన్నాడు.

పాండ్యాను పక్కన పెట్టడం పద్దతి కాదు..

పాండ్యాను పక్కన పెట్టడం పద్దతి కాదు..

'టీమ్ మేనేజ్‌మెంట్ ఇషాన్ కిషన్‌ని తీసుకురావాలని నిర్ణయించుకుంటే.. అప్పుడు సూర్యకుమార్ యాదవ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అయితే ఓపెనర్‌గా ఇషాన్ మెరుగ్గా రాణించడం మనం చూశాం. కాబట్టి అతనికి మిడిల్ ఆర్డర్‌లో అవకాశం దక్కడం కష్టమే అవుతుంది. సూర్య మిడిల్ ఆర్డర్‌లో బాగా ఆడగలడు. మైదానం మొత్తం షాట్‌లు ఆడతాడు. కాబట్టి సూర్య ఇన్నింగ్స్ చివరిలో ఉపయోగపడతాడు.

కేవలం ఒక గేమ్ తర్వాత హార్దిక్ పాండ్యాను డ్రాప్ చేయడం అన్యాయం. అతడిని జట్టులో కొనసాగించాలనుకుంటే పాండ్యాకు అనువైన స్లాట్‌ను కనుగొనాలి. హార్దిక్ బయట కూర్చున్న బ్యాటర్ల కంటే గొప్పవాడు. అతను తిరిగి ఫామ్‌లోకి రావాలంటే.. మధ్య ఓవర్లలో కొంత సమయం ఇవ్వాలి' అని తివారి చెప్పుకొచ్చాడు. భారత్ మంచి అనుభవం కలిగిన జట్టని, ఇకపై ఆడే ప్రతి గేమ్‌ మంచి రన్‌ రేట్‌తో గెలవాలని కోరాడు. న్యూజిలాండ్‌తో పోరులో కోహ్లీసేన విజయం సాధిస్తుందని తివారి ఆశాభావం వ్యక్తం చేశాడు.

Story first published: Sunday, October 31, 2021, 18:32 [IST]
Other articles published on Oct 31, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X