న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీని వెనక్కి నెట్టిన షోయబ్ మాలిక్: ట్విట్టర్‌లో సానియా మీర్జా అభినందన

By Nageshwara Rao
Sania Mirzas Special Post For Husband Shoaib Malik After He Completes 2,000 T20I Runs

హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో రెండువేల పరుగులు పూర్తి చేసిన మూడో ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న టీ20లో సిరీస్‌లో షోయబ్ మాలిక్ ఈ రికార్డు నెలకొల్పాడు.

ఈ మ్యాచ్‌లో షోయబ్ మాలిక్ 24 బంతుల్లో 37 పరుగులు సాధించడం ద్వారా ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటివరకు టీ20ల్లో ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే రెండు వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. ఆ ఇద్దరూ న్యూజిలాండ్‌కు చెందిన క్రికెటర్లే కావడం విశేషం.

న్యూజిలాండ్‌ క్రికెటర్లు మార్టిన్‌ గుప్తిల్‌(2,271), బ్రెండన్‌ మెక్‌కలమ్‌(2,140) ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. కాగా, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ(1,992 పరుగులు) మూడో స్థానంలో ఉండగా, తాజాగా కోహ్లీని వెనక్కినెట్టి షోయాబ్‌ మాలిక్‌(2,026) మూడో స్థానంలో నిలిచాడు.

ట్విట్టర్‌లో సానియా మిర్జా అభినందన

షోయబ్ మాలిక్ రెండు వేల పరుగుల మైలురాయిని అందుకోగానే అతడి భార్య, భారత టెన్నిస్‌ ప్లేయర్ సానియా మీర్జా తన ట్విటర్‌‌లో షోయబ్ మాలిక్‌కు అభినందనలు తెలిపింది. ‘మొత్తానికి సాధించావు. గర్వంగా ఉందంటూ' ఐసీసీ చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేసింది.

1999లో అంతర్జాతీయ వన్డే అరంగేట్రం

1999లో అంతర్జాతీయ వన్డే అరంగేట్రం

ఇప్పటివరకు 99 టీ20 మ్యాచ్‌లాడిన షోయబ్ మాలిక్ 31.65 యావరేజితో 2,026 పరుగులు నమోదు చేశాడు. 1999లో షార్జా వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన షోయబ్ మాలిక్ టీ20లో నిలకడగా రాణిస్తున్నాడు. షోయబ్ మాలిక్ ఇప్పటివరకు వన్డేల్లో 6.975 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 41 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

2015లో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు

2015లో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు

అంతేకాదు, 2009లో వరల్డ్ టీ20, 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన పాకిస్థాన్ జట్లలో సభ్యుడిగా కూడా ఉన్నాడు. 2015లో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. నిజానికి, షోయబ్ మాలిక్‌ కంటే ముందే విరాట్‌ కోహ్లీ ఐర్లాండ్‌ పర్యటనలోనే టీ20ల్లో రెండువేల పరుగుల మైలురాయిని అందుకుంటాడని అభిమానులు భావించారు.

ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీ సాధించేనా?

ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీ సాధించేనా?

అయితే, ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో డకౌట్‌గా వెనుదిరిగిన కోహ్లీ, రెండో టీ20లో 8పరుగులకే పరిమితమయ్యాడు. దీంతో 2వేల పరుగులు చేరుకోవడానికి మరో ఎనిమిది పరుగుల వెనక నిలిచాడు. ఇంగ్లాండ్‌తో మంగళవారం నుంచి మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో విరాట్ కోహ్లీ(1,992), రోహిత్ శర్మ(1,949)లు రెండువేల పరుగుల మైలురాయి అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు.

Story first published: Monday, July 2, 2018, 13:20 [IST]
Other articles published on Jul 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X