న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షోయబ్‌తో సానియా పరిచయం: ఓ రెస్టారెంట్‌.. సాయంత్రం 6 గంటలు!!

Sania Mirza revealed that she first met Shoaib Malik at a restaurant in Hobart


ఢిల్లీ: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్‌ మాలిక్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2010 ఏప్రిల్‌ 12న హైదరాబాద్‌లో జరిగిన సానియా-షోయబ్‌ల పెళ్లి అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. షోయబ్‌తో సానియా ప్రేమ, పెళ్లి అప్పట్లో రెండు దేశాల్లో చర్చనీయాంశమైంది. పెళ్లి సమయంలో ఇద్దరు కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో ఉన్నారు.

బుమ్రా రికార్డు బద్దలు.. అశ్విన్‌ రికార్డు సమం!!బుమ్రా రికార్డు బద్దలు.. అశ్విన్‌ రికార్డు సమం!!

 ఓ రెస్టారెంట్‌.. సాయంత్రం 6 గంటలు:

ఓ రెస్టారెంట్‌.. సాయంత్రం 6 గంటలు:

శనివారం జరిగిన ఇండియా టుడే ఇన్‌స్పిరేషన్‌ కార్యక్రమంలో షోయబ్‌తో తన తొలి పరిచయం గురించి సానియా గుర్తు చేసుకుంది. ఆ్రస్టేలియా హోబర్ట్‌లోని ఒక రెస్టారెంట్‌లో తొలిసారి షోయబ్‌ను కలిశానని ఆమె తెలిపింది. 'క్రీడాకారులుగా మేమిద్దరం ఒకరికొకరం తెలుసు. కానీ తొలిసారి షోయబ్‌ను హోబర్ట్‌లోని ఒక రెస్టారెంట్‌లో సాయంత్రం 6 గంటల సమయంలో కలిశా. అప్పుడు అక్కడ ఎవరూ లేరు. మా ఇద్దరినీ విధి కలిపిందని అప్పట్లో నేను గట్టిగా నమ్మేదాన్ని' అని సానియా అంది.

ప్రణాళిక ప్రకారమే:

ప్రణాళిక ప్రకారమే:

'అయితే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే.. నేను అక్కడ ఉన్నానని తెలుసుకొని షోయబ్‌ ప్రణాళిక ప్రకారమే నా దగ్గరికి వచ్చాడట. ఇదంతా అతని ప్లాన్‌ అని ఆలస్యంగా తెలిసింది' అంటూ సానియా తెలిపింది. సానియా-షోయబ్ ఏప్రిల్ 12, 2010న హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు, తరువాత వారి వలీమా వేడుకను పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో నిర్వహించారు. ఈ జంట గత ఏడాది అక్టోబర్‌లో ఓ మగ బిడ్డకు జన్మనిచ్చారు. అతని పేరు ఇజాన్ మీర్జా మాలిక్.

 హోబర్ట్‌ టోర్నీతో బరిలోకి:

హోబర్ట్‌ టోర్నీతో బరిలోకి:

సానియా మీర్జా మళ్లీ రాకెట్‌ పట్టేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే హోబర్ట్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీతో కోర్టులో అడుగుపెట్టనున్నట్టు 33 ఏళ్ల హైదరాబాదీ స్టార్‌ ప్రకటించింది. వచ్చే ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో కూడా పాల్గొంటానని తెలిపింది. ఆస్ట్రేలియా ఓపెన్‌ మహిళల డబుల్స్‌లో నాదియా కిచనోక్‌ (ఉక్రెయిన్‌)తో, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రాజీవ్‌ రామ్‌ (అమెరికా)తో కలిసి సానియా బరిలోకి దిగుతుంది.

రెండేళ్లుగా ఆటకు దూరం:

రెండేళ్లుగా ఆటకు దూరం:

2017 అక్టోబర్‌ నుంచి సానియా టెన్నిస్ ఆటకు దూరంగా ఉంది. బాబుకు జన్మనిచ్చిన తర్వాత సానియా రెండేళ్లుగా టెన్నిస్‌ ఆటకు దూరంగా ఉంటోంది. చివరిగా 2017 అక్టోబరులో చైనా ఓపెన్‌లో ఆడింది. 'హోబర్ట్‌ టోర్నీ కంటే ముందే ముంబైలో జరిగే ఐటీఎఫ్‌ టోర్నీ ఆడాలనుంది. కానీ.. దానిపై ఇప్పుడే ఏం చెప్పలేను. నా మణికట్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఆ టోర్నీలో ఆడే అవకాశాలు ఫిఫ్టీ-ఫిఫ్టీగా ఉన్నాయి' అని సానియా ఇటీవలే తెలిపింది.

ఫిట్‌నెస్‌పై దృష్టి:

ఫిట్‌నెస్‌పై దృష్టి:

ఇజాన్ పుట్టిన తర్వాత సానియా తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించింది. గర్భిణిగా ఉన్న సమయంలో అధిక బరువు పెరిగింది. ఇక తిరిగి కోర్టులో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే బరువు తగ్గించుకునేందుకు సానియా తీవ్రంగా శ్రమిస్తోంది. క్రమం తప్పకుండా జిమ్‌లో కసరత్తులు చేస్తూ చెమటోడ్చుతోంది. ఈ నేపథ్యంలో సానియా నాలుగు నెలల్లో 26 కేజీల బరువు తగ్గింది. జిమ్‌లో కష్టపడుతున్న కొన్ని వీడియోలను సానియా తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలలో కూడా పోస్ట్ చేసింది.

Story first published: Sunday, December 8, 2019, 16:00 [IST]
Other articles published on Dec 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X