న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్మగ్లింగ్ కేసు: సనత్ జయసూర్యతో పాటు మరో ఇద్దరు క్రికెటర్లు

Sanath Jayasuriya, two other cricketers, accused of smuggling rotten betel nut to India: Report

హైదరాబాద్: భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు సనత్ జయసూర్య. శ్రీలంకను ప్రచంచ క్రికెట్‌లో ఓ బలమైన శక్తిగా నిలిపిన క్రికెటర్లలో అతనూ ఒకడు. ఎన్నో గొప్ప రికార్డులను తన ఖాతాలో లిఖించాడు. అలాంటి దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్యపై ఇప్పుడు స్మగ్లింగ్ ఆరోపణలు వచ్చాయి.

భారత్‌కు కోట్ల విలువైన వక్కలను అక్రమ దారిలో పంపినట్లు సనత్ జయసూర్యతో పాటు మరో ఇద్దరు క్రికెటర్లపై స్మగ్లింగ్ ఆరోపణలు వచ్చాయి. నాగ్‌పూర్‌లో కోట్ల విలువైన వక్కలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సీజ్ చేసిన సమయంలో జయసూర్య పేరు బయటకు వచ్చినట్లు దైనిక్ భాస్కర్ తన కథనంలో వెల్లడించింది.

ఈ స్మగ్లింగ్ కేసులో సనత్ జయసూర్యతోపాటు మరో ఇద్దరు క్రికెటర్లు కూడా ఉన్నారు. అయితే ఆ ఇద్దరు ఎవరనేది ఇంకా బయటకు రాలేదు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పూర్త వివరాలను ముంబై పోలీసులు శ్రీలంక ప్రభుత్వానికి అందజేశారు. ఈ నేపథ్యంలో జయసూర్య ఇప్పటికే విచారణ కోసం ఓసారి ముంబై వచ్చి వెళ్లారు.

డిసెంబర్ 2న విచారణకు పిలిచే అవకాశం

డిసెంబర్ 2న విచారణకు పిలిచే అవకాశం

జయసూర్యతో పాటు ఈ స్మగ్లింగ్‌లో పాలుపంచుకున్న మిగతా ఇద్దరు క్రికెటర్లను డిసెంబర్ 2న విచారణకు పిలిచే అవకాశం ఉంది. రెవెన్యూ ఇంటిలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ దిలిప్ సివారే వెల్లడించిన వివరాల ప్రకారం వక్కలను సాధారణంగా ఇండోనేషియా నుంచి శ్రీలంకకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఇండియాకు ఎగుమతి చేస్తారు.

 పన్నులు ఎగ్గొట్టడానికి ఇది మంచి మార్గం

పన్నులు ఎగ్గొట్టడానికి ఇది మంచి మార్గం

పన్నులు ఎగ్గొట్టడానికి ఇది మంచి మార్గం. ఇందు కోసం జయసూర్యతోపాటు ఆ ఇద్దరు క్రికెటర్లు డమ్మీ కంపెనీలను కూడా సృష్టించారని, తమకున్న పలుకుబడిని ఉపయోగించి వీళ్లు ఆ సంస్థలకు అనుమతులు పొందినట్లు తమ విచారణలో వెల్లడైనట్లు ఆయన తెలిపారు.

మినహాయింపు శ్రీలంక ద్వారా భారత్‌కు వస్తే

మినహాయింపు శ్రీలంక ద్వారా భారత్‌కు వస్తే

శ్రీలంక ద్వారా భారత్‌కు వస్తే సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా చట్టం కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. అదే, ఇండోనేషియా నుంచి నేరుగా భారత్‌కు వస్తే 108 శాతం దిగుమతి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వ్యాపారులు శ్రీలంకను అక్రమ మార్గంగా ఎంచుకుంటున్నారని దిలిప్ సివారే వెల్లడించారు.

తక్కువ ధరకే కోట్ల విలువైన వక్కలు దిగుమతి

తక్కువ ధరకే కోట్ల విలువైన వక్కలు దిగుమతి

నాగ్‌పూర్‌కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ అతి తక్కువ ధరకే కోట్ల విలువైన వక్కలను దిగుమతి చేసుకుంటున్నాడు. శ్రీలంక నుంచి వక్కలను దిగుమతి చేసుకోవడం ద్వారా ఆ బిజినెస్ మ్యాన్ పెద్ద మొత్తంలో లబ్ధిపొందుతున్నాడు. నిజానికి ఇండోనేషియా నుంచి వక్కలను దిగుమతి చేసుకుంటే దాని విలువ రూ.100 కోట్లు కాగా, అదే లంక నుంచి దిగుమతి చేసుకుంటే రూ. 25 కోట్లే అవుతుంది. ఈ అక్రమ స్మగ్లింగ్‌కు సనత్ జయసూర్య లాంటి క్రికెటర్లు సహాకరిస్తున్నారు.

Story first published: Thursday, November 22, 2018, 15:56 [IST]
Other articles published on Nov 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X