న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

BBL:పరుగు తీస్తూ బౌలర్‌ను ఢీకొట్టిన బ్యాట్స్‌మన్ (వీడియో)

BBL : Sam Harper Suffered A Massive Blow During BBL Match || Oneindia Telugu
Sam Harper and Nathan Ellis were involved in a nasty collision in BBL

మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియా దేశవాళీ టీ20 టోర్నీ.. బిగ్‌బాష్‌లీగ్‌లో విచారకర ఘటన చోటుచేసుకుంది. పరుగు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు బౌలర్‌ను ఢీకొట్టిన ఓ బ్యాట్స్‌మన్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలయ్యాడు. హర్బర్ట్ హరికేన్స్, మెల్‌బోర్న్ రెనిగెడ్స్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. క్రికెట్‌ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయిన ఫిలిప్ హ్యూస్ ఉదంతాన్ని గుర్తుచేసింది.

కొంచెం ఉంటే పైకి పోయేవాడే: రాకాసి బౌన్సర్‌కు క్రీజులోనే కుప్పకూలిన మ్యాక్స్‌వెల్ (వీడియో)కొంచెం ఉంటే పైకి పోయేవాడే: రాకాసి బౌన్సర్‌కు క్రీజులోనే కుప్పకూలిన మ్యాక్స్‌వెల్ (వీడియో)

హర్భర్ట్ హరికేన్స్ బౌలర్ నాథన్ ఎల్లిస్ వేసిన నాలుగో ఓవర్‌ నాలుగో బంతిని రెనిగెడ్స్ బ్యాట్స్‌మన్ సామ్ హర్పర్ మిడాఫ్ మీదుగా ఆడి సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఫీల్డర్ బంతినందుకోవడాన్ని గమనించిన హర్పర్.. ముందు చూసుకోకుండా పరుగెత్తాడు. అయితే బంతి అందుకోవడానికి అక్కడే నిలబడ్డ బౌలర్ ఎల్లిస్‌ను బలంగా ఢికొట్టి గాల్లోకి ఎగిరాడు. కిందపడే క్రమంలో అతని మెడ బలంగా నేలను తాకింది. ఈ ఘటనతో మైదానమంతా నిశబ్ధం ఆవహించగా.. ఫిజియోలు హుటాహుటిన పరుగెత్తుకొచ్చారు. అయితే హర్పర్ నిలబడి తన గాయం అంత తీవ్రమైనది కాదనే సంకేతాలు ఇచ్చాడు. కానీ అతని పరిస్థితి సీరియస్‌గా ఉందని గమనించిన డాక్టర్.. వెంటనే ఆసుపత్రికి తరలించమని నిర్వాహకులకు సూచించాడు. దీంతో హర్పర్ రిటైర్ట్ హర్ట్‌గా మైదానం వీడాడు.

ఇక మిగతా మ్యాచ్‌ కోసం అతని స్థానాన్ని టామ్ కూపర్‌తో భర్తీ చేసిన రెనిగేడ్స్ మేనేజ్‌మెంట్.. హపర్ చికిత్స తీసుకుంటున్నాడని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను బిగ్‌బాష్ లీగ్ నిర్వాహకులు తమ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేయగా వైరల్ అయింది. ఇది చూసిన యావత్ క్రికెట్ ప్రపంచం నివ్వెరపోతుంది. ఆ బ్యాట్స్‌మన్ కోలుకోవాలని ప్రార్థిస్తుంది.

ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు దొరికిండు : అక్తర్ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు దొరికిండు : అక్తర్

ఇక ఈ మ్యాచ్‌లో రెనిగెడ్స్ 4 పరుగులతో ఓటమిపాలైంది. చివరి ఓవర్లో రెనిగేడ్స్ విజయానికి 11 పరుగులు అవసరం కాగా.. హరికేన్స్ బౌలర్ నాథన్ ఎల్లిస్ అద్భుతంగా బౌలింగ్ చేసి 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం రెనిగేడ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 186 పరుగులకే పరిమితమైంది. అఫ్గాన్ క్రికెటర్ మహ్మద్ నబీ 30 బంతుల్లో 63 పరుగులు చేసినా తన జట్టు రెనిగేడ్స్‌ను గెలిపించలేకపోయాడు.

Story first published: Tuesday, January 21, 2020, 20:36 [IST]
Other articles published on Jan 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X