న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Salman Butt: హర్షల్ పటేల్ స్లోయర్ బాల్స్ మీద ఎక్కువ ఆధారపడకుంటే మంచిది

 Salman Butt Suggests that Harshal Patel Should Use His Pace

పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ హర్షల్ పటేల్ బౌలింగ్ యాక్షన్ గురించి మాట్లాడాడు. హర్షల్ పటేల్ స్లోయర్ బాల్స్‌పై ఎక్కువగా ఆధార పడకుండా తన పేస్‌ను మరింత ఉపయోగించాల్సిన అవసరం ఉందని చెప్పాడు. హర్షల్ పటేల్ ఐపీఎల్లో బాల్ ఆఫ్ పేస్ తీసుకోవడం ద్వారా చాలా సార్లు సక్సెస్ అయ్యాడు. తద్వారా ఎకనామికల్‌గా బౌలింగ్ చేయడమే కాకుండా.. వికెట్లు కూడా తీస్తూ సత్తా చాటాడు. తద్వారా అతను భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల హర్షల్ పటేల్ ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక గాయం నుంచి కోలుకుని తిరిగి తన లయ అందుకోవడానికి చాలా కష్టపడ్డాడు. అతను తొలి రెండు టీ20ల్లో భారీగా పరుగులు లీక్ చేశాడు. అయితే మూడో టీ20లో చివరి ఓవర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 7పరుగులు మాత్రమే ఇచ్చి మళ్లీ కమ్ బ్యాక్ అయ్యాడు. ఇక సల్మాన్ భట్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. హర్షల్ పటేల్ డిసిసవ్ బౌలర్. కానీ ఒకసారి బ్యాటర్లు అతని చేతి నుంచి డెలివరీ రిలీజ్ చూస్తే.. అతన్ని సులువుగా ఎదుర్కోగలరు. హర్షల్ పటేల్ స్లో డెలివరీలపై ఎక్కువగా ఆధారపడలేడని, అతని పేస్‌‌ను చూపించాల్సిందేనని సల్మాన్ పేర్కొన్నాడు.

'హర్షల్ పటేల్ చాలా డిసిసివ్ బౌలర్. అతని చేతి నుంచి బాల్ రిలీజ్ చూస్తే.. బ్యాటర్లు ఈజీగా కనిపెట్టేస్తారు. అతనికి ఈ విషయం చాలా టఫ్‌గా ఉంటుంది. రాబోయే మ్యాచ్‌లలో అతను ఈ సమస్యను ఎలా ఎదుర్కోబోతున్నాడో నాకు తెలియదు. ఫాస్ట్ బౌలర్ అయినందున.. అతను స్లోయర్ బాల్‌పై ఎక్కువగా ఆధారపడలేడు. అతను మంచి బౌలర్. ఫుల్-పేస్ బంతిని కూడా అతను బౌల్ చేయగలడు. తన పేస్‌ని అతను ఉపయోగిస్తే మరింత రాణించగలడు' అని బట్ పేర్కొన్నాడు.

అలాగే ఆస్ట్రేలియాపై భువనేశ్వర్ కుమార్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. భువీ గురించి భట్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో డెత్ ఓవర్లలో చాలా పరుగులను లీక్ చేస్తున్నాడు. మంచి బ్యాటింగ్ ట్రాక్‌లపై బౌలింగ్ చేస్తున్నప్పుడు పేసర్‌కు చాలా ఇబ్బందిగా ఉంటుందని బట్ చెప్పాడు. భారతదేశం అతని నుంచి ఏమి ఆశిస్తుందో నాకు అర్థం కావడం లేదు. మంచి బ్యాటింగ్ పిచ్‌లలో భువీని డెత్ ఓవర్లలో ప్రయోగించడం అంత మంచిది కాదు' అని బట్ అన్నాడు.

Story first published: Tuesday, September 27, 2022, 12:26 [IST]
Other articles published on Sep 27, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X