న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఉరుకులాటే పృథ్వీషా కొంపముంచుతుంది: పాక్ క్రికెటర్

Salman Butt says why Prithvi Shaw would miss a spot in India’s T20 World Cup squad

కరాచీ: నిలకడలేమి ఆటనే టీమిండియా యంగ్ ఓపెనర్ పృథ్వీషాకు అవకాశాలు రాకుండా చేస్తుందని పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ సల్మాన్ బట్ అన్నాడు. దూకుడుగా ఆడాలనే అతని ఆతృత అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకుండా చేయవచ్చని అభిప్రాయపడ్డాడు. ఎంతో ప్రతిభ కలిగిన అతను మరింత నిలకడగా రాణించాల్సిన అవసరం ఉందన్నాడు.

పవర్‌ప్లేలో వికెట్ కాపాడుకుంటూ సౌకర్యంగా బ్యాటింగ్ చేసే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ లాంటి ఆటగాళ్లనే టీమిండియా ఓపెనర్లుగా ఎంచుకుంటుందన్నాడు. మెగా టోర్నీకి ధాటిగా ఆడే పృథ్వీ షాను సెలెక్టర్లు పట్టించుకోరని తెలిపాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా పృథ్వీ షా టీ20 ప్రపంచకప్ అవకాశాలను సల్మాన్ బట్ విశ్లేషించాడు.

 పృథ్వీ షాకు నో చాన్స్..

పృథ్వీ షాకు నో చాన్స్..

'పృథ్వీ షాలో ప్రతిభకు కొదవ లేదు. అతను ధాటిగా పరుగులు చేయగలడు. కానీ ధాటిగా ఆడే క్రమంలో అతను రిస్కీ షాట్లు ఆడుతున్నాడు. దీనివల్ల తొందరగా వికెట్‌ కోల్పోయే అవకాశం ఉంది. ప్రతీసారి దూకుడుగా ఆడాలనుకోవడం అతనిలో స్థిరత్వం లేదని చూపిస్తుంది. ఏ జట్టైనా పవర్‌ ప్లేలో స్థిరంగా ఆడే బ్యాట్స్‌మెన్‌‌కు ప్రాధాన్యత ఇస్తోంది. టీమిండియాకు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌ రూపంలో ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు పృథ్వీ షా వారి పక్కన స్థానం సంపాదించాలంటే ముందు స్థిరత్వం చూపించాలి. టీ20 ప్రపంచకప్‌ లాంటి మేజర్‌ టోర్నీలకు ఇది చాలా కీలకం. షా తన పద్దతి మార్చుకోకుండా ఇలాగే ఆడితే మాత్రం అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కడం కష్టమే'అని సల్మాన్ బట్ చెప్పుకొచ్చాడు.

 కేఎల్ రాహుల్ బెస్ట్..

కేఎల్ రాహుల్ బెస్ట్..

జట్టు ఎంపిక టీమిండియా సెలెక్టర్లకు తలనొప్పిగా మారిందని సల్మాన్ బట్ తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటే ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని, వారిలో ఎవరిని ఎంచుకోవాలనేది సెలెక్టర్లకు సవాల్‌గా మారిందన్నాడు. ఇక తన అభిప్రాయం ప్రకారం ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌ను తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ అని తెలిపాడు. అతను బ్యాటింగ్‌తో పాటు కీపింగ్ కూడా చేయగలడని, దాంతో కెప్టెన్‌కు మరో బౌలర్‌ను తీసుకునే అవకాశం ఉంటుందన్నాడు.

కెప్టెన్‌కు ఈజీ..

కెప్టెన్‌కు ఈజీ..

కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా జట్టులోకి తీసుకోవడం మంచి ఆప్షన్. అతను మంచి బ్యాట్స్‌మన్‌తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేయగలడు. దాంతో టీమ్ బ్యాలెన్సింగ్‌గా ఉంటుంది. కెప్టెన్‌కు ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మన్, ఎక్స్‌ట్రా బౌలర్‌ను తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. పరిస్థితులకు తగ్గట్లు అవసరమైన వారిని తీసుకోవచ్చు. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం కేఎల్ రాహుల్ ఫస్ట్ చాయిస్ ఓపెనర్'అని సల్మాన్ బట్ చెప్పుకొచ్చాడు.

దుమ్మురేపిన పృథ్వీషా

దుమ్మురేపిన పృథ్వీషా

గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమైన పృథ్వీ షా(0, 2).. భారత జట్టులో చోటు కోల్పోయాడు. అతని బ్యాటింగ్ టెక్నిక్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో భారత్‌కు వచ్చిన అనంతరం తన లోపాలపై దృష్టిసారించి లోపాలను సరిదిద్దుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో విధ్వంసకర బ్యాటింగ్‌తో మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఆ టోర్నీలో ఏకంగా 800 పైగా పరుగులు చేసి ఈ ఘనతను అందుకున్న తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఇక ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ అదే జోరును కొనసాగించిన పృథ్వీ షా.. ఢిల్లీ క్యాపిటల్స్ సునాయస విజయాలందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 8 మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలున్నాయి. ఇక కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ ఓవర్‌లోనే 6 ఫోర్లు కొట్టి అరుదైన ఫీట్ నెలకొల్పాడు.

Story first published: Thursday, May 20, 2021, 16:01 [IST]
Other articles published on May 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X