న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ రూల్స్ తెలుసుకోండి.. పదే పదే ఇజ్జత్ తీసుకోకండి.. పాక్ ఆటగాళ్లకు సల్మాన్ బట్ అడ్వైజ్!

Salman Butt Says Pakistan Players Should Take These Classes And Clear Their Doubts over No-ball Controversy

కరాచీ: పాకిస్థాన్ ఆటగాళ్లు క్రికెట్ రూల్స్ తెలుసుకోవాలని ఆ జట్టు మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ సూచించాడు. నిబంధనలపై ఏ మాత్రం అవగాహన లేకుండా అంపైర్లతో వాగ్వాదానికి దిగి పరువు తీసుకోకూడదన్నాడు. పదే పదే పాక్ ఆటగాళ్లు నిబంధనలు తెలియనట్లే వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు. ఆదివారం భారత్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో పాక్ 4 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌లో నోబాల్‌‌పై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఇది నోబాల్ అని కొందరంటే.. మరికొందరు కాదని వాదించారు. అలాగే ఫ్రీ హిట్‌కు విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ కాగా.. భారత ఆటగాళ్లు పరుగులు తీసారు. దీనిపై కూడా పాక్ ఆటగాళ్లు అంపైర్లతో వాదనకు దిగారు. ఈ క్రమంలోనే తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన సల్మాన్ బట్.. ఈ రెండు ఘటనలపై వివరణ ఇచ్చాడు.

అది నో బాలే..

అది నో బాలే..

'నోబాల్‌ వివాదానికి వస్తే బంతి బ్యాట్‌కు కనెక్ట్‌ అయ్యే సమయంలో బ్యాటర్‌ నడుము కంటే కొంచెం ఎత్తులో ఉంది. అంటే.. నోబాల్‌ అనిపించుకొనే అర్హత దానికి ఉంది. ఆ బంతికి సిక్స్‌ కొట్టాడు. అదే వికెట్‌ పడితే.. నోబాలా కాదా అనే అంశంపై థర్డ్‌ అంపైర్‌కు వెళ్లవచ్చు. అంటే ఈ మ్యాచ్‌లో థర్డ్‌ అంపైర్‌ వద్దకు వెళ్లే అవకాశమే లేదు. ఇక ఫ్రీ హిట్‌ విషయానికి వస్తే.. రనౌట్‌, బంతిని చేతితో ఆపటం,ఫీల్డింగ్‌ను అడ్డుకోవడం, రెండుసార్లు బంతిని కొట్టడం వంటివి జరిగితేనే ఔట్‌గా ఇస్తారు. ఇవి కాకుండా ఏం జరిగినా ఔట్‌ కాదు. ఇక్కడ బంతి వికెట్లను తాకి థర్డ్‌మెన్‌ వైపు వెళ్లింది.

వారికి ఆ అవగాహన ఉంది...

వారికి ఆ అవగాహన ఉంది...

ఈ సమయంలోనే 'ప్రజన్స్‌ ఆఫ్‌ మైండ్‌' చాలా ముఖ్యం. అది ఉండటంతో బ్యాటర్లు మూడు పరుగులు చేశారు. దురదృష్టవశాత్తు పాక్‌ ఆటగాళ్లు ఆటపై అవగాహన లేకుండా అంపైర్‌తో వాగ్వాదానికి దిగారు. ప్రపంచ వ్యాప్తంగా లీగ్స్‌ ఆడే పాక్‌ ఆటగాళ్లకు క్రికెట్‌ నిబంధనలు తెలిసి ఉండాలి. క్రికెట్‌ చట్టాలు.. వాటిని సందర్భానికి అన్వయించుకొనే విషయానికి వస్తే మనవాళ్ల తీరుకు ఓ ఉదాహరణ చెబుతా. గతేడాది ప్రపంచకప్‌ మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌.. హఫీజ్‌ వేసిన బంతిని సిక్స్‌ కొట్టాడు. వాస్తవానికి ఆ బంతి హఫీజ్‌ చేయిజారి పిచ్‌ మధ్యలో పడింది. అది నోబాల్‌. రెండు సార్లు నేలను తాకిన బంతిని కూడా చాలా అవగాహనతో వార్నర్‌ సిక్స్‌గా మలిచాడు.

గతేడాది కూడా..

గతేడాది కూడా..

ఆ బంతికి అతను ఔటయ్యే ఛాన్స్‌ లేదు.. ఈ విషయంపై స్పష్టమైన అవగాహన ఉండటంతో ధైర్యం చేసి సిక్స్‌ కొట్టాడు. దీంతో సిక్స్‌, నోబాల్‌ రన్‌, ఫ్రీ హిట్‌ లభించాయి. అప్పుడు కూడా పాక్‌ ఆటగాళ్లు అంపైర్‌తో చర్చలు జరిపారు. క్రికెట్‌ చట్టాలను అన్వయించుకోవడం, తెలుసుకోవడంలో ఆటగాళ్ల లోపాన్ని ఇది తెలియజేస్తోంది. ఇటువంటి సందర్భాలు తక్కువగా వస్తాయి.. కానీ.. అవి కూడా ఒత్తిడితో కూడిన మ్యాచుల్లోనే ఎదురవుతాయి. కాబట్టి రూల్స్‌పై అవగాహన ఉండటం చాలా ముఖ్యం'అని తెలిపాడు.

Story first published: Wednesday, October 26, 2022, 17:29 [IST]
Other articles published on Oct 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X