న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Salman Butt : టీమిండియా పాలసీ సూపర్.. జట్టుకు ఢోకా లేదు

Salman Butt Praised Teamindia Management Rotation Policy

పాకిస్థాన్ మాజీ ఓపెనర్ సల్మాన్ భట్ భారత జట్టు మేనేజ్‌మెంట్‌ పట్ల ప్రశంసల జల్లు కురిపించాడు. భారత జట్టు మేనేజ్ మెంట్ రొటేషన్ పాలసీ వల్ల ఆ జట్టుకు మంచి బెంచ్ స్ట్రెంత్‌ లభిస్తోందని.. ఇక ఆ జట్టుకు ఢోకా లేదని పేర్కొన్నాడు. భారత్ రొటేషన్ పాలసీ వల్ల జట్టులో ఎంపిక చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు అందుబాటులోకి వస్తున్నారని, అలాగే ఎంపిక చేసుకున్నవారి పట్ల శ్రద్ధ, వాళ్లకు సుదీర్ఘ కెరీర్‌ అవకాశాలను ఇవ్వడానికి ఉపయోగపడుతుందని భట్ చెప్పారు.

గత టీ20 ప్రపంచ‌కప్‌లో భారత జట్టు గ్రూప్-స్టేజ్‌లోనే ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి టీమిండియా స్క్వాడ్‌లో అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. గాయాలు, వర్క్ లోడ్ వంటి వాటి విషయంలోనూ జట్టు మేనేజ్ మెంట్ ఢిఫెరెంట్ అప్రోచ్‌తో వ్యవహరిస్తుంది.

'ప్రతి సిరీస్‌లో ఒకే ఆటగాళ్లను ఆడించకుండా భారత జట్టు రొటేషన్ విధానం అనుసరించడం ఓ కామన్ పద్ధతి అయిపోయింది. అవసరముంటే సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తున్నారు. యువకులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. జట్టును తరచూ మారుస్తున్నారు. చాలా మంది ప్లేయర్లు ఎంపికవుతున్నారు. డిఫెరెంట్ కాంబినేషన్లు కొనసాగుతున్నాయి.

ఎక్కువ మంది ప్లేయర్లు ఉండడం వల్ల కొన్ని సమయాల్లో సెలెక్షన్ కష్టంగా మారుతుంది.. కానీ బెంచ్ ప్లేయర్లను ఎక్కువ మందిని కలిగి ఉండడం వల్ల జట్టులో ఓ ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది.' అని భట్ తన యూట్యూబ్ ఛానెల్‌లో తెలిపాడు. ఆసియా కప్‌కు ముందు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ విరామం తీసుకోవడం కూడా బెటర్ డిసిషన్ అని భట్ పేర్కొన్నాడు.

IND VS PAK: రోహిత్ సేన ఒళ్లు దగ్గర పెట్టుకోని ఆడాలి *Cricket | OneIndia Telugu

టీమిండియా జింబాబ్వే టూర్‌కు ఎన్సీఏ ఛీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ హెచ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. తద్వారా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు కూడా విశ్రాంతి లభిస్తుంది. టీమిండియాలో హ్యుమన్ రిసోర్సెస్ పెరగడంతో.. భారత క్రికెట్ జట్టులో మానవ అభివృద్ధి జరుగుతోంది. ఇది అద్భుతమైనది.' అని భట్ పేర్కొన్నాడు. ఇకపోతే జింబాబ్వేతో హరారేలో జరిగే మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్ తొలి మ్యాచ్‌ ఆగస్టు 18న ఆడనుంది. ఐపీఎల్ తర్వాత తొలిసారిగా కేఎల్ రాహుల్ జట్టులోకి తిరిగి రావడం, కెప్టెన్సీ చేపట్టనుండడం గమనార్హం.

Story first published: Sunday, August 14, 2022, 14:21 [IST]
Other articles published on Aug 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X